TGSRTC Good News: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, విజయవాడ రూట్‌లో వెళ్లేవారికి రాయితీ ప్రకటన
Hyderabad to Vijayawada Bus News | ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వెళ్లేవారికి టికెట్ ధరలో 10 శాతం, 8 శాతం రాయితీ ప్రకటించారు.

Vijayawada to Hyderabad Bus News | హైదరాబాద్: తెలంగాణ హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే బస్సులకు TGSRTC ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. సూపర్ లగ్జరీ సర్వీసులు, లహరి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ లో 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ తెలిపింది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎవరైనా టీజీఎస్ఆర్టీసీ టికెట్ ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://tgsrtcbus.inని సందర్శించాలని సూచించారు. ఇటీవల బెంగళూరుకు వెళ్లే బస్సులకు సైతం 10 శాతం రాయితీ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ.
విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 19, 2025
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను #TGSRTC యాజమాన్యం ప్రకటించింది.
లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్ల… pic.twitter.com/KpjA2rwC3J
బెంగళూరుకు వెళ్లే బస్సులకు సైతం 10 శాతం రాయితీ
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ చల్లని కబురు చెప్పింది. బెంగళూరు మార్గంలో రాకపోకలకు టికెట్ ధరలో 10 శాతం రాయితీని TGSRTC కల్పిస్తోంది. ఈ రాయితీ అనంతరం ఒక్కొక్కరికి రూ.100 నుంచి 160 రూపాయల వరకు ఆదా అవుతుంది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ పది శాతం రాయితీ వర్తిస్తుందని ఇటీవల సజ్జనార్ తెలిపారు.
Also Read: Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

