OTT Telugu Movie: వెన్నెల కిషోర్ కామెడీ సినిమా... ఇవాళ్టి నుంచి మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ - లాఫింగ్ ధమాకా ఎక్కడ చూడొచ్చంటే?
Srikakulam Sherlock Holmes OTT Platform: వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ సినిమా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. ఈటీవీ విన్ ఓటీటీలో జనవరిలో విడుదలైంది. ఇప్పుడు మరొక ఓటీటీలో కూడా వచ్చింది.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేసే వినోదం అందించడంలో ముందుండే ఈ తరం హాస్యనటుడు వెన్నెల కిషోర్ (Vennela Kishore). ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' (Srikakulam Sherlock Holmes). ఓటీటీ వేదికలోకి ఈ సినిమా వచ్చి సుమారు నెల రోజులు అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా మరొక ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ 'వెన్నెల' కిషోర్ సినిమా!
OTT Telugu Comedy Thriller Movie: వెన్నెల కిషోర్ టైటిల్ పాత్రలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ సినిమా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. సరిగ్గా నాలుగు వారాలకు జనవరి 25న ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా మరొక ఓటీటీలో కూడా వచ్చింది.
ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల అయిన మూడు వారాలకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
అసలు 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' కథ ఏమిటి?
ఉత్తరాంధ్రలో రాజకీయ పర్యటన ముగించుకుని పెరంబదూర్ వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో మరణించారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే... పెరంబదూర్ వెళ్లడానికి ముందు ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తారు. అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా సీఐ భాస్కర్ (అనీష్ కురువిల్లా) ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో భీమిలి సముద్ర తీరంలో ఓ యువతి పులిదిండి మేరీ హత్యకు గురవుతుంది. ఆ కేసు విషయంలో విలేకరి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురవడంతో వారం రోజుల్లోపు హంతకులను పెట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెబుతాడు భాస్కర్.
రాజీవ్ గాంధీ హత్య కేసుతో పాటు యువతి మర్డర్ మిస్టరీని డీల్ చేయలేక మేరీ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ (వెన్నెల కిశోర్) చేతిలో పెడతాడు. అతడు ఏం చేశాడు? కేసు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కేసుకు, ప్రేమ జంట బాలు (రవితేజ), భ్రమ (అనన్యా నాగళ్ళ)కు సంబంధం ఏమిటి? ఎస్సై పట్నాయక్ (ప్రభాకర్) సస్పెన్షన్ వెనుక కథ ఏమిటి? అనేది ఆసక్తికరం.
'వెన్నెల' కిషోర్ కాకుండా ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం మరొక కీలక పాత్ర చేశారు. 'మల్లేశం, వకీల్ సాబ్, తంత్ర'తో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ, రవితేజ 'నేనింతే' ఫేమ్ సియా గౌతమ్ హీరోయిన్లు. 'బాహుబలి'లో కాలకేయ పాత్ర చేసిన ప్రభాకర్, 'డిజె టిల్లు, బలగం' ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇతర తారాగణం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ పతాకం మీద వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి విడుదల చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

