Rakul Preet Singh: రకుల్ పెళ్లిలో ఫోనుల్లేవ్... ఆ కండిషన్ ఎందుకో చెప్పిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీతో రకుల్ వివాహం గతేడాది ఫిబ్రవరిలో జరిగింది. ఆ పెళ్లికి హాజరైన అతిథులకు కొన్ని కండిషన్స్ పెట్టారు. అందులో ఫోన్స్ తీసుకురాకూడదనేది ఒకటి. అది ఎందుకో రకుల్ చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) చేతిలో ఇప్పుడు తెలుగు సినిమాలు లేవు. కానీ, ఆవిడకు స్టార్ స్టేటస్ రావడానికి కారణం టాలీవుడ్డే. తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలు అందరితోనూ రకుల్ సినిమాలు చేశారు. కథానాయికగా మంచి పొజిషన్ ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేశారు. వివాహం చేసుకొని జీవితంలో ఓ ఇంటి కోడలు అయ్యారు. జాకీ, రకుల్ దంపతులు తమ పెళ్లికి వచ్చిన అతిథులకు కొన్ని కండిషన్స్ పెట్టారు. అందులో నో ఫోన్ పాలసీ ఒకటి. దాని వెనుక కారణాలను ఆవిడ తాజాగా వివరించారు.
లగ్జరీ కంటే లైఫ్ మూమెంట్స్ ముఖ్యం!
Rakul Preet Singh wedding anniversary: రకుల్ ప్రీత్ సింగ్ వివాహం జరిగి, ఆవిడ ఓ ఇంటి కోడలు అయ్యి మరికొన్ని గంటల్లో ఏడాది కానుంది. ఫిబ్రవరి 21, 2024లో ఆమె పెళ్లి చేసుకున్నారు. గోవాలో ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఆ పెళ్లి జరిగింది. అప్పట్లో పెళ్లికి వచ్చిన అతిథులు అందరినీ పెళ్లి మండపం దగ్గరకు ఫోన్స్ తీసుకు రావద్దని చెప్పారు. ఎందుకు? అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రకుల్ వెల్లడించారు.
పెళ్లి గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ''మేం ఎప్పుడూ మా పెళ్లి చాలా సింపుల్‌గా ఉండాలని అనుకున్నాం. మాకు (రకుల్, జాకీ) లగ్జరీ కంటే కంఫర్ట్ ముఖ్యం. లైఫ్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం ముఖ్యం. అన్నిటి కంటే సంతోషానికి మేం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. పెళ్లి ఎంజాయ్ చేయడం కోసం ఫోన్స్ వద్దు (నో ఫోన్ పాలసీ) అని చెప్పాం. అంతే తప్ప... పెళ్లి ఫోటోలు లీక్ చేస్తారని కాదు. నేను పెళ్లిలో వేసుకున్న ప్రతి డ్రస్ లో డ్యాన్స్ చేశా. ఆఖరికి నా పెళ్లి గౌనులో కూడా'' అని చెప్పారు.
Also Read: రాజమౌళికి లైన్ వేసిన యాంకర్ రష్మీ... ఐ లవ్యూ కూడా చెప్పేసింది - వైరల్ వీడియో చూడండి
థియేటర్లలోకి శుక్రవారం... ఆవిడ నా భర్తకు భార్య!
Rakul Preet Singh Upcoming Movies: రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే... ఈ నెల 21వ తేదీన (శుక్రవారం) కొత్త హిందీ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అర్జున్ కపూర్ జంటగా ఆవిడ నటించిన సినిమా 'మేరే హజ్బెండ్ కి బీవీ' (Mere Husband Ki Biwi) ఆ రోజు విడుదల అవుతోంది. అందులో భూమి ఫెడ్నేకర్ మరొక హీరోయిన్. ఇది కాకుండా కమల్ హాసన్ 'ఇండియన్ 3', అజయ్ దేవగణ్ 'దే దే ప్యార్ దే' సినిమాలు ఉన్నాయి. 'ఇండియన్ 3'లో సిద్ధార్థ్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. పెళ్లి తర్వాత రకుల్ ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తున్నారు. సౌత్ నుంచి ఆఫర్స్ వస్తే చేయడానికి తాను రెడీ అని చెబుతున్నారు.
Also Read: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

