అన్వేషించండి
Advertisement

Droupadi Murmu AP Tour: ఏపీ పర్యటనలో బిజీబిజీగా రాష్ట్రపతి ముర్ము, విశాఖలో ఘనంగా నేవీ డే సెలబ్రేషన్స్
విశాఖపట్నం ఆర్.కె. బీచ్ లో నిర్వహించిన నౌకాదళ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రాత్రి 7.42 గంటలకు విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్ళారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
1/13

తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతికి విజయవాడలో పౌర సన్మానం చేశారు.
2/13

రాష్ట్రపతి ముర్మును గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సత్కరించారు.
3/13

ఆదివారం ఉదయం 10.30కు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేరుకున్నారు. విజయవాడలో రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.
4/13

ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని, అందుకే హిందీలో మాట్లాడుతున్నానన్నారు. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు అంటూ ద్రౌపదీ ముర్ము తెలుగులో మాట్లాడారు.
5/13

వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ నేలపైకి రావడం ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయన్నారు.
6/13

కూచిపూడి నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎన్నడూ మర్చిపోలేమన్నారు.
7/13

ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి వచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
8/13

తిరుమల బాలాజీ ఉన్న పవిత్ర స్థలానికి రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
9/13

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఐ ఎన్ యస్ డేగాలో ఘనంగా వీడ్కోలు పలికారు.
10/13

భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడన్న రాష్ట్రపతి ... ఏపీకి చెందిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తుచేశారు.
11/13

అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, ఇలా పలువురి పేర్లను ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఏపీని పునీతం చేస్తున్నాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
12/13

విశాఖపట్నం ఆర్.కె. బీచ్ లో నిర్వహించిన నౌకాదళ దినోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో కార్యక్రమాలు ముగించుకొని ఐఎఎస్ డేగ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 7.42 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్ళారు.
13/13

రాష్ట్రపతికి ఐఎఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజనీ, ఫైర్ సర్వీస్ డి.జి.పి. ఎన్. సంజయ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సీపీ సిహెచ్ శ్రీకాంత్, నేవీ అధికారులు, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు
Published at : 04 Dec 2022 09:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement