BMW Bikes Price Hike: జనవరి నుంచి భారీగా పెరగనున్న బైక్ ధరలు - బీఎండబ్ల్యూ క్రేజీ డెసిషన్!
BMW Bikes Price: 2025 జనవరి నుంచి బీఎండబ్ల్యూ బైక్ ధరలను పెంచనుంది. దీంతో ఒకేసారి బీఎండబ్ల్యూ మనదేశంలో విక్రయిస్తున్న 27 బైక్‌లు, స్కూటీల ధర 2.5 శాతం పెరగనుంది.
Bike Price Hike: 2025 కొత్త సంవత్సరం రావడానికి ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరం రాకతో తేదీ మారడమే కాదు మార్కెట్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా వాహన తయారీ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నారు. కొన్ని వాహనాలు ఖరీదైనవి అయితే మరికొన్ని చవకగా మారనున్నాయి. బీఎండబ్ల్యూ తన బైక్‌ల ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచనుంది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కూడా అన్ని మోడళ్ల ధరలను పెంచబోతోంది. బైక్‌ల ధర ఒకేసారి 2.5 శాతం పెరగనుంది.
ఈ బైక్‌లు ఇక మరింత ఖరీదు...
భారతదేశంలో బీఎండబ్ల్యూ కార్లు మాత్రమే కాదు. బైక్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజలు కూడా బీఎండబ్ల్యూ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి బీఎండబ్ల్యూ మోటోరాడ్... తాను తయారు చేస్తున్న అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచబోతోంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా అన్ని రేంజ్‌ల మోటార్‌సైకిళ్ల ధరలను పెంచబోతున్నామని వాహన తయారీ కంపెనీలు అంటున్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్ అనుబంధ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2017 ఏప్రిల్‌లో భారతదేశ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్‌లు భారతీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.'
Also Read: స్కోడా కైలాక్ రేటు రివీల్ అయ్యేది అప్పుడే - డెలివరీ ఎప్పుడు వస్తుంది?
భారతదేశంలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశంలో 27 మోడళ్లను కలిగి ఉంది. ఈ మోడళ్లలో 24 మోటార్ సైకిళ్లు, మూడు స్కూటర్లు ఉన్నాయి. ఈ మూడు స్కూటర్ల జాబితాలో సీఈ 02, సీఈ 04, సీ 400 జీటీ ఉన్నాయి. బీఎండబ్ల్యూ సీఈ 04 దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ తర్వాత సీఈ 02 లాంచ్ అయింది. ఇది మార్కెట్‌లో రూ. ఐదు లక్షల రేంజ్‌లో విడుదలైంది.
బీఎండబ్ల్యూ చవకైన బైక్ గురించి చెప్పాలంటే టీవీఎస్ సహకారంతో తయారు అయిన జీ 310 ఆర్ అని చెప్పవచ్చు. ఈ మోటార్‌సైకిల్ ధర రూ.2.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దేశంలో బీఎండబ్ల్యూ అత్యంత ఖరీదైన బైక్ ఎం 1000 ఆర్ఆర్. ఈ ద్విచక్ర వాహనం ధర దాదాపు రూ.55 లక్షలుగా ఉంది.
Also Read: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Lavaorange metallic isn’t just a color, it’s a statement!
— BMWMotorrad (@BMWMotorrad) November 29, 2024
The new BMW #R12S comes equipped with everything you need — including the new helmet Grand Racer “Daytona” to get you on the road!
Learn more: https://t.co/p44ir5nzX7#MakeLifeARide #Soulfuel #BMWMotorrad pic.twitter.com/NhniW5xXnp
Genes of the R 90 S with a fresh look — the new BMW #R12S! 🤩
— BMWMotorrad (@BMWMotorrad) November 28, 2024
Find out more:https://t.co/p44ir5nzX7#MakeLifeARide #Soulfuel #BMWMotorrad
__
The BMW R 12 S can only be ordered for a limited time.
Enhanced with AI. pic.twitter.com/hCINug4bWm