ఛార్జింగ్ పెట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు - యాక్టివా ఎలక్ట్రిక్‌లో సూపర్ ఫీచర్! హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రజలు చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఇది భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. హోండా యాక్టివా ఈ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో మొదటిది స్టాండర్డ్ వేరియంట్ కాగా, రెండోది హోండా రోడ్‌సింక్ డ్యుయో. హోండా యాక్టివా ఈలో మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఐదు కలర్ ఆప్షన్లలో ఈ హోండా ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 102 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ. ఈ టూవీలర్ బ్యాటరీని రిమూవ్ చేసే ఆప్షన్ ఉంది. అంటే మీరు స్పేర్‌గా ఒక బ్యాటరీ కొనిపెట్టుకుంటే ఒక దాంట్లో ఛార్జ్ పెట్టుకుని ఇంకో దాంతో బైక్ డ్రైవ్ చేయవచ్చన్న మాట.