District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ ‘పుష్ప 2’. ఈ సినిమా టికెట్లు కొన్ని గంటల పాటు డిస్ట్రిక్ అనే యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
District By Zomato: అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ‘పుష్ప 2’ టికెట్లు కొన్ని గంటల పాటు డిస్ట్రిక్ట్ అనే యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనున్నాయి. జొమాటో రూపొందించిన ఈ యాప్ ‘పుష్ప 2’ టికెట్ల కోసం సినిమా టీమ్‌తో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గత నెలలో లాంచ్
2024 నవంబర్‌లో ఈ యాప్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ యాప్‌లో సినిమా టికెట్లతో పాటు స్పోర్ట్స్, లైవ్ పెర్ఫార్మెన్స్‌లకు సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పలు రెస్టారెంట్లకు సంబంధించిన ఆఫర్లు కూడా ఈ యాప్‌లో చూడవచ్చు. బుక్ మై షో టికెటింగ్ ప్లాట్‌ఫాంతో పోటీ పడేందుకు ఈ యాప్‌ను జొమాటో అందుబాటులోకి తీసుకువచ్చింది. పేటీయం టికెటింగ్ సర్వీస్‌ను కూడా జొమాటో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 244 మిలియన్ డాలర్లు అని సమాచారం. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.2,048.4 కోట్లు అన్నమాట.
ఫుడ్ డెలివరీ, క్విక్ కమర్షియల్స్‌లో కూడా...
జొమాటో యాప్ ద్వారా ఫుడ్ డెలివరీలో దూసుకుపోతున్న ఈ సంస్థ... బ్లింకిట్ ద్వారా క్విక్ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టింది. అంటే మీ ఇంటికి సంబంధించిన వస్తువులు వేటిని అయినా 10 నిమిషాల్లోనే బ్లింకిట్ డెలివరీ చేస్తుందన్న మాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది.
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
డిసెంబర్ 5న ‘పుష్ప 2’
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కానుంది. ఈ సినిమాకు ఉన్న బజ్, హైప్ కారణంగా డిస్ట్రిక్ యాప్ ప్రజల్లోకి వెళ్లడం కోసం ‘పుష్ప 2’ టీమ్‌తో జొమాటో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టికెట్లు ఆన్‌లైన్‌లో ముందుగా కొనాలని అనుకునే చాలా మంది డిస్ట్రిక్ యాప్‌ను బుక్ చేసుకుంటారు. అది ఈ యాప్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. ఇదే విధంగా చాలా బ్రాండ్స్ ‘పుష్ప 2’ టీమ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నెవర్ బిఫోర్ టికెట్ రేట్లు
‘పుష్ప 2’ సినిమాకు నైజాం ప్రాంతంలో నెవ్వర్ బిఫోర్ టికెట్ హైక్స్ వచ్చాయి. ముందు రోజు ప్రీమియర్ షో టికెట్లను రికార్డు రేట్లకు అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ముందు ప్రీమియర్లకు సింగిల్ స్క్రీన్లలో రూ.1121, మల్టీప్లెక్స్‌ల్లో రూ.1239 రేట్లుగా నిర్ణయించారు. అలాగే మొదటి నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.354, మల్టీప్లెక్స్‌ల్లో రూ.531 ధరలకు టికెట్లను విక్రయించనున్నారు. ఐదో రోజు నుంచి 12వ రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.300.9, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.472 టికెట్ రేట్లుగా నిర్ణయించారు. 13వ రోజు నుంచి 29వ రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లు రూ.200.6గానూ, మల్టీఫ్లెక్స్‌లో రూ.354గానూ ఉండనున్నాయి. ఇలా ఏకంగా నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా టికెట్ రేట్ల హైక్స్ ఉండనున్నాయన్న మాట.