అన్వేషించండి

Allu Arjun Remuneration: షారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?

Allu Arjun fee for Pushpa 2: 'పుష్ప 2'కు బన్నీ భారీ పారితోషికం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన నెంబర్ వన్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా రికార్డును క్రియేట్ చేశారు.

ఇండస్ట్రీలో స్టార్స్ రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ పేరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఫేమ్ పెరిగే కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది అన్న సంగతి తెలిసిందే. ఇలా క్రేజ్ ను బట్టి హైయెస్ట్ పెయిడ్ స్టార్ స్టేటస్ అందుకునే సెలబ్రిటీల పేర్లు కూడా మారుతాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం (Allu Arjun Remuneration) అందుకుంటున్న స్టార్ హీరోగా నిలిచాడు. మరి ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...

'పుష్ప 2' కోసం 300 కోట్లు తీసుకున్న బన్నీ?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2 : ది రూల్" (Pushpa 2 The Rule) మూవీ డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని నవంబర్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి స్టార్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడయ్యాయి.

'పుష్ప' పార్ట్ వన్ లో అద్భుతంగా నటించి జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. అయితే ఈ సీక్వెల్ కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ మాత్రం అందర్నీ నోర్లు వెళ్లబెట్టేలా చేస్తోంది. "పుష్ప 2" కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 300 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు అన్న వార్త సంచలనంగా మారింది. దీంతో ఆయన అత్యధిక పారితోషికం అందుకుంటున్న భారతీయ నటుల స్థానంలో మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో ఆయన రజనీకాంత్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలను పారితోషికం విషయంలో బీట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

Read Also : Tamil Actor: 750 రూపాయలకు ఫ్యాక్టరీలో పని చేశాడు... కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా హీరో - ఆ 'సింగం' స్టార్ ఎవరో తెలుసా?


ఇది వరకు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ప్రభాస్, షారుక్ ఖాన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ "పుష్ప 2" కోసం ఏకంగా 300 కోట్లు పారితోషకంగా అందుకుని వీరందరిని వెనక్కి నెట్టేశారు. "పుష్ప" తర్వాత ఆయన పాపులారిటీ, డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా ఈ రేంజ్ లో పెరిగిందని టాక్ నడుస్తోంది. షారుక్ ఖాన్ నిన్న మొన్నటిదాకా ఒక్కో సినిమాకు 150 నుంచి 250 కోట్లు వసూలు చేసి, ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత విజయ్ 170 నుంచి 275 కోట్లతో విజయ్ రెండవ స్థానంలో ఉన్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ 300 కోట్లతో ఈ లిస్టులో డైరెక్టుగా ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ఏదేమైనా ఇది పుష్ప గాడి రూల్ అంతే అంటూ బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.  

ఇదిలా ఉండగా మామూలుగానే 'పుష్ప 2'పై హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీలో సమంత, శ్రీలీల ఎంట్రీ ఉంటుందనే వార్తలతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. "పుష్ప 2" డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.  

Read Also: భారీ మొత్తానికి ‘కంగువ‘ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న స్ట్రీమింగ్ దిగ్గజం, ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS NZ Live Score: భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS NZ Live Score: భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Kiran Abbavaram: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
CUET UG 2025: సీయూఈటీ యూజీ - 2025 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
సీయూఈటీ యూజీ - 2025 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Shivangi Trailer: సత్యభామతో సవాల్ చేస్తే చావే - 'శివంగి'గా ఆనంది పవర్ ఫుల్ యాక్షన్ అదుర్స్, థ్రిల్లింగ్ ట్రైలర్ చూశారా?
సత్యభామతో సవాల్ చేస్తే చావే - 'శివంగి'గా ఆనంది పవర్ ఫుల్ యాక్షన్ అదుర్స్, థ్రిల్లింగ్ ట్రైలర్ చూశారా?
Donald Trump: అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టాం: డొనాల్డ్ ట్రంప్​
అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టాం: డొనాల్డ్ ట్రంప్​
Embed widget