అన్వేషించండి

Kanguva OTT: భారీ మొత్తానికి ‘కంగువ‘ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న స్ట్రీమింగ్ దిగ్గజం, ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా చిత్రం ‘కంగువ’ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ అమౌంట్ కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Kanguva OTT Platform : తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అట్టహాసంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11 వేలకు పైగా స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. చాలా మంది నెటిజన్లు సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ ఓటీటీ స్త్రీమింగ్ కు సంబంధించి డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఏ సంస్థ దక్కించుకుంది? ఎప్పుడు విడుదల చేయబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘కంగువ’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రైమ్ వీడియో

‘కంగువ’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్త్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది.  ఈ సినిమా థియేటర్లలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ వెర్షన్ లో విడుదల అయ్యింది. ఓటీటీలోనూ ఈ భాషలు అన్నింట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అనే చర్చ చేస్తున్నారు నెటిజన్లు.

వాస్తవానికి ఓ సినిమా థియేటర్లలోకి విడుదలయ్యాక 4 వారాలకు ఓటీటీలోకి వస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇదే పద్దతిని పాటిస్తున్నారు. అయితే, ‘కంగువ’ భారీ బడ్జెట్ సినిమా కావడంతో మరో రెండు వారాలు ఆలస్యంగా.. అంటే 6 వారాలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ సంస్థ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

‘కంగువ’ సినిమా గురించి..

‘కంగువ’ సినిమాలో సూర్య, దిశా పటానీ జంటగా నటించారు. బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషించారు. సిరుత్తై శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య ఏకంగా 5 క్యారెక్టర్లు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో 1678కి చెందిన పోరాట యోధుడు ‘కంగువ’గా, ఈ తరానికి చెందిన ‘ఫ్రాన్సిస్’ అనే యువకుడి పాత్రలు చాలా కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పాత్రల్లో ఆయన అద్భుత నటనతో అలరించినట్లు తెలుస్తోంది.

క్యారెక్టర్ క్యారెక్టర్ కు ఆయన చూపించిన మేనరిజం, వేరియేషన్స్ వారెవ్వా అనిపించేలా ఉన్నాయట. ఈ సినిమా అంతా సూర్య వన్ మ్యాన్ షో చేసినట్లు తెలుస్తోంది. దిశా పటానీ, బాబీ డియోల్ సైతం  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీని రూ. 350 కోట్లతో తెరకెక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 

Read Also: సన్నీ డియోల్ మూవీలో ‘మసూద‘ బ్యూటీ, తెలుగమ్మాయి దశ తిరిగినట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget