అన్వేషించండి

Jaat Movie: సన్నీ డియోల్ మూవీలో ‘మసూద‘ బ్యూటీ, తెలుగమ్మాయి దశ తిరిగినట్టేనా?

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జాట్’. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో ‘మసూద’ బ్యూటీ బాంధవి శ్రీధర్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Bandhavi Sridhar in Jaat Movie: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. తెలుగు దిగ్గజ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  

‘జాట్’ మూవీలో ‘మసూద’ బ్యూటీకి ఛాన్స్

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘జాట్’ సినిమాలో తెలుగమ్మాయి, ‘మసూద’ ఫేమ్ బాంధవి శ్రీధర్ ఛాన్స్ దక్కించుకుంది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె క్యారెక్టర్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయేషా ఖాన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2025లో విడుదల కానుంది. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  

బాంధవి శ్రీధర్ గురించి..

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘మసూద’ సినిమాలో తెలుగమ్మాయి బాంధవి శ్రీధర్ దెయ్యం పట్టిన అమ్మాయిగా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతో అలరించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘మసూద’తో పాటు ‘మళ్ళీ రావా’,  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆమె కెరీర్ కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘మసూద’.  ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.  బాంధవి శ్రీధర్ మిస్ ఇండియా 2019లో రన్నర్ అప్ గా నిలిచింది. అదే ఏడాది జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 పోటీల్లో టైటిల్ దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar)

‘జాట్’ సినిమా గురించి..  

తెలుగులో బాలయ్య మాదిరిగానే, బాలీవుడ్ లో సన్నీ డియోల్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా ‘జాట్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆయన ఇమేజ్ కు తగినట్లుగానే యాక్షన్ సీక్వెన్స్ లో పెద్ద ఫ్యాన్ ను చేతిలో పట్టుకుని అగ్రెసివ్ కనిపించారు. గోపీచంద్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటారు.ఈ సినిమాలోనూ ఆయన అదే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. సన్నీ డియోల్ చివరి సినిమా ‘గదర్ 2’లోనూ అచ్చం ఇలాంటి ఫైట్సే చేశారు. ఇప్పుడు సన్నీ డియోల్ మాస్ యాక్షన్ కు గోపీచంద్ మరింత మసాలా జోడించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో గోపీచంద్ బాలీవుడ్ లో మంచి హిట్ అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. సన్నీ డియోల్‌కి నార్త్‌ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉంది. గోపీచంద్ బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Read Also: : ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’- దుమ్మురేపుతున్న టామ్‌ క్రూజ్‌ టీజర్‌ ట్రైలర్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget