Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Andhra Pradesh News | బీటెక్ స్టూడెంట్, ఓ వివాహిత ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో భార్యను ఆమె ప్రియుడితో చూసిన భర్త దాడికి పాల్పడ్డాడు.
BTech student love affair with married woman | తంబళ్లపల్లె: ప్రేమ గుడ్డిది, కళ్లు లేవంటారు. అయితే ప్రేమించుకున్న జంటలు, పెళ్లిళ్లు చేసుకున్న వారి సంసారాలు ఎన్నో కారణాలతో నాశనం చేసుకుంటున్నారు. అక్కర్లేని ప్రేమ మైకంలో మునిగిపోతే ఆ అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోవడం ఖాయం. కళ్లకు కనిపించిందే రంగుల ప్రపంచం అన్నట్లుగా హద్దులు లేకుండా ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేది కొందరైతే.. ఒకరితో పెళ్లయ్యాక కూడా మరొకరితో ప్రేమ అంటూ అక్రమ బంధాల వైపు వెళ్తూ కొందరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందినదే ఓ వివాహిత, యువకుడి ఇన్‌స్టాగ్రామ్ లవ్ స్టోరీ. చివరికి మహిళ భర్తకు వ్యవహారం తెలియడంతో ఆమె ప్రియుడ్ని పట్టుకుని చితకబాది బుద్ధి చెప్పాడు.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివాహిత పరిచయం, ఆపై చాటింగ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్రశేఖర్ (20), కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఇన్‌స్టాగ్రాంలో మదనపల్లె మండలం సీటీఎంకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. అప్పటికే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు పిల్లలు సైతం ఉన్నారు. కానీ ఆమె భర్తను మోసం చేస్తూ తన బుద్ధి బయటపెట్టింది.
భార్య వ్యవహారంతో భర్తకు అనుమానం
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారింది. ఓ ఏడాది పాటు వారిద్దూ గాఢంగా ప్రేమించుకున్నారు. తమ విషయం ఎవరికీ తెలియకపోవడంతో కొన్నాళ్లు వ్యహహారం బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల కిందట ఆమెపై భర్తకు అనుమానం వచ్చింది. స్మార్ట్‌ఫోన్లో ఏం చేస్తుందా అని గమనించిన ఆమె భర్తకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తోందని.. అతడి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పసిగట్టాడు. తన భార్యను దారిలో పెట్టాలని భావించాడు. అదే సమయంలో భార్య లవర్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్న ఇంద్రశేఖర్ ను పట్టుకుని బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు.
లవర్ మెస్సేజ్ చూసి పరుగున వెళ్లిన వివాహిత, సీన్ కట్ చేస్తే
భార్య ఎవరితో చాటింగ్ చేస్తుంది, ప్రేమలో మునిగి తేలుతుందో సైలెంట్‌గా ఆమె ప్రియుడి వివరాలు రాబట్టాడు. యువకుడు మెస్సేజ్ చేయడంతో శనివారం రాత్రి తన భార్య బయటకు వెళ్లడం గమనించాడు. కొందరు సన్నిహితులు, స్నేహితులతో వెళ్లి ఇంద్రశేఖర్, తన భార్య చెట్టు కింద కూర్చుని మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాపురాలు కూల్చడమే నీకు పనా రా అంటూ ఆ యువకుడ్ని చితకబాదారు. భార్య ఎదుటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ లవర్‌ను పట్టుకుని దాడిచేశారు. చక్కగా చదువుకోకుండా, ప్రేమ పేరుతో పెళ్లయిన ఆడవారి వెంట పడటం ఏంటని బుద్ధిచెప్పారు. వివాహిత భర్త, ఆమె బంధువుల దాడిలో గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.