అన్వేషించండి

APPSC Group 2 Results: ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్

AP Group 2 Results: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

APPSC Group 2 Results: అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను (ఫైనల్ సెలెక్షన్ లిస్ట్) మంగళవారం అర్ధరాత్రి తరువాత ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ అభ్యర్థుల వివరాలను కమిషన్ వెల్లడించింది. అయితే, క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన కారణంగా, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థుల కోరిక మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్‌ఓ పోస్టులను ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచారు.

ఏపీ గ్రూప్ 2 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ప్రకటించిన 891 పోస్టులలో హైకోర్టు తీర్పును అనుసరించి, హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మరో 25 పోస్టుల ఎంపికలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మిగిలిన 866 పోస్టుల ఎంపికలో ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా ప్రకటించని 14 పోస్టుల విషయానికి వస్తే.. హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన 2 స్పోర్ట్స్ కోటా పోస్టులు కాకుండా, మిగిలిన 12 పోస్టులలో (7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులు) ఆయా కేటగిరీలకు తగిన అభ్యర్థులు లభ్యం కాలేదు.

View Pdf

2023 డిసెంబర్ లో వచ్చిన నోటిఫికేషన్..
ఈ గ్రూప్-2 నియామక ప్రక్రియ 2023 డిసెంబరు 7న విడుదలైన ప్రకటనతో ప్రారంభమైంది. 2024 ఫిబ్రవరి 25న అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వచ్చిన తరువాత, 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2025 ఏప్రిల్ 4న ఫలితాలను వెల్లడించినప్పటికీ, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల తుది ఎంపిక జాబితా విడుదల చేయడంలో జాప్యం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్ (11/2023) ద్వారా భర్తీ అవుతున్న 905 ఉద్యోగాల జాబితా, పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను ప్రధానంగా ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలుగా విభజించారు.

1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు (మొత్తం 331)
డెప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar): రెవెన్యూ శాఖలో అత్యంత ఆదరణ ఉన్న పోస్ట్ (114 ఖాళీలు).
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Excise SI): ఎక్సైజ్ శాఖలో శాంతి భద్రతలు మరియు పర్యవేక్షణ (150+ ఖాళీలు).
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (Assistant Labour Officer): కార్మిక శాఖలో చట్టాల అమలు.
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: పట్టణ పరిపాలన విభాగం.
సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ.
అసిస్టెంట్ రిజిస్ట్రార్: సహకార సంఘాల విభాగం.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్: పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ.

2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు (మొత్తం 574)
ఇవి ప్రధానంగా సచివాలయం, వివిధ ప్రభుత్వ శాఖలలో పరిపాలన, అకౌంట్స్ విభాగాలకు చెందినవి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO): ఏపీ సచివాలయం (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ విభాగాల్లో సుమారు 260+ పోస్టులు).
సీనియర్ అకౌంటెంట్: ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ.
సీనియర్ ఆడిటర్: స్టేట్ ఆడిట్ విభాగం.
జూనియర్ అసిస్టెంట్: ఏపీపీఎస్సీ, వ్యవసాయ, సామాజిక సంక్షేమ, పోలీస్ (DGP ఆఫీస్) వంటి వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసుల్లో.
జూనియర్ అకౌంటెంట్: ఖజానా, అకౌంట్స్ విభాగం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget