Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
TDP : తెలుగుదేశం పార్టీలో చేరికల సైడ్ ఎఫెక్టులు కనిపిస్తున్నాయి. వైసీపీని ఖాళీ చేయాలని చేసే ప్రయత్నంలో టీడీపీలో సమస్యలు ఏర్పడుతున్నాయి.
TDP Joining Side Effects: వైసీపీ బలహీనం చేయాడానికి స్ట్రాటజిక్ గా ఆ పార్టీకి చెందిన కీలకనేతల్ని,క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే పార్టీ క్యాడర్ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేదు.ఎవర్నీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో చేరాలనుకున్న వారిని కూడా కొంత కాలం ఆగండి అని ఆపేస్తున్నారు. వైసీపీని నిర్వీర్యం చేయాలంటే నేతల్ని లాగేయాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటోంది. వారు వస్తే తమ అవకాశాల్ని ఎక్కడ తన్నుకుపోతారోనని క్యాడర్ వ్యతిరేకిస్తోంది. పార్టీ నేతల మాటల్ని కాదని ఎవర్నైనా చేర్చుకంటే పరిస్థితి తారుమారవుతుందని టీడీపీ పెద్దలు కూడా వేచి చూడాలనుకుంటున్నారు.
ఆళ్ల నాని చేరిక వాయిదా
ఏలూరు జిల్లాలో కీలక వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు.టీడీపీ అధినేతతో సంప్రదింపులు జరిపి లైన్ క్లియర్ చేసుకున్నారు. పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. కానీ ఏలూరు టీడీపీ నేతలు మాత్రం ఆపేశారు. ఆయన వద్దని తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో చేరికలు ఆగిపోయాయి. ఆయన అవసరం లేకుండా భారీ మెజార్టీ సాధించామని ఇప్పుడు ఆయన చేరిక వల్ల సమస్యలు వస్తాయని .. పార్టీ బలోపేతం కాకపోగా వర్గాలుగా మారిపోతుందని ఎమ్మెల్యే స్థాయి నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అంతా ఆగిపోయింది.
కూటమి పార్టీలతో టచ్‌లో వైసీసీ సీనియర్ నేతలు
రాజకీయ వర్గాల గుసగుసల ప్రకారం చూస్తే.. వైసీపీకి చెందిన అరవై శాతం మంది సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలతో చర్చలు జరుపుతున్నాయి. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు పార్టీలో చేరిపోతామంటున్నారు. కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కేసులు పాలైన. గత ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడిన ఎవర్నీ చేర్చుకోవాలని అనుకోవడం లేదు. పార్టీకి మేలు జరుగుతుంది అనుకున్న వారిని చేర్చుకునేందుకు కూటమి పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ అంతర్గతంగా వ్యక్తమవుతున్న అసంతృప్తి అలా కూడా చేర్చుకోలేకపోతున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఆమె ఏ నియోజకవర్గానికి చెందని నేత కాబట్టి అలాంటి వారి చేరికలపై వ్యతిరేకత ఉండదు. కానీ వైసీపీలో ఓ స్థాయిలో పని చేసి టీడీపీలో వచ్చే వారితో తమ స్థానాలకు ఎసరు వస్తుందని అనుకున్న వారు మాత్రం.. ఇతర నేతల్ని రానివ్వడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని ఇతరుల్ని పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు ఏ మాత్రం అనుకోవడం లేదు.అందుకే చేరికల విషయంలో టీడీపీ అధినాయకత్వం ఒత్తిడికి గురవుతోంది.