అన్వేషించండి
Pushpa 2 Collection Day 3: ఆల్ టైమ్ రికార్డ్... 'పుష్ప 2' మూడో రోజు కలెక్షన్స్ ఎంత? టోటల్ ఎంత?
Pushpa 2 Box Office Collection Day 3: బాక్స్ ఆఫీస్ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వసూళ్ల దండయాత్ర కంటిన్యూ అవుతోంది. మూడో రోజు కూడా 'పుష్ప 2' భారీ కలెక్షన్లు సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే...

'పుష్ప 2' మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
1/5

థియేటర్లలో మాస్ జాతరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామి కంటిన్యూ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఫాస్టెస్ట్ సినిమాగా 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేయగా... శనివారం సైతం భారీ కలెక్షన్లు సాధించింది. ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే...
2/5

'పుష్ప 2' చిత్రానికి శనివారం 115 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పోర్టల్ పేర్కొంది. తెలుగు నుంచి 31.5 కోట్ల రూపాయలు రాగా... హిందీలో 73.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పేర్కొంది. తమిళనాడులో ఏడున్నర కోట్లు, కర్ణాటకలో 80 లక్షలు, మలయాళం నుంచి కోటి 70 లక్షల రూపాయలు వచ్చాయని సమాచారం.
3/5

'పుష్ప 2' గురువారం విడుదల కాగా శుక్రవారం ఆ సినిమాకు ఇండియాలో 93.8 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చినట్లు సదరు ట్రేడ్ పోర్టల్ పేర్కొంది. ఆ లెక్కన విడుదలైన రెండో రోజుతో కంపేర్ చేస్తే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు. ఆదివారం అడ్వాన్స్ సేల్స్ చాలా బాగున్నాయట.
4/5

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 'పుష్ప 2' సినిమా 550 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి 650 కోట్ల రూపాయలు దాటవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
5/5

అల్లు అర్జున్ కెరీర్ పరంగా పుష్ప హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. రూ. 1000 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Published at : 08 Dec 2024 10:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion