Tamil Actor: 750 రూపాయలకు ఫ్యాక్టరీలో పని చేశాడు... కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా హీరో - ఆ 'సింగం' స్టార్ ఎవరో తెలుసా?
Kollywood Star Hero Journey: ఈ హీరోకి మాత్రం అస్సలు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. నెలకు రూ. 750లకు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. ఈ పాన్ ఇండియా స్టార్ ఎవరో తెలుసా?
ఈ నటుడు స్టార్ కిడ్ మాత్రమే కాదు ఇప్పుడు సూపర్ స్టార్. తన శ్వాగ్, స్టైల్, పర్ఫామెన్స్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా సౌత్ లో ఈసారి హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలంటే అభిమానులు పడి చస్తారు. ఇక ఈ హీరో తన యాక్టింగ్ స్కిల్స్ తో జాతీయ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఓ పాన్ ఇండియా మూవీతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించారు కూడా. కానీ ఆయన కెరీర్ మొదట్లో ఓ ఫ్యాక్టరీలో రూ.750 రూపాయల జీతానికి పని చేశారు. మరి ఇంకా అతను ఎవరో అర్థం అర్థం కాలేదా? ఆయన మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ సూర్య.
View this post on Instagram
ప్రముఖ తమిళ నటుడు శివ కుమార్, లక్ష్మీ దంపతులకు సూర్య 1975 జూలై 23న జన్మించారు. ఆయన సోదరుడు కార్తీ కూడా హీరో. వీళ్లకు ఓ సిస్టర్ బృందా కూడా ఉన్నారు. పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్లో స్కూల్ లైఫ్ గడిపిన సూర్య, సెకండరీ స్కూల్ మాత్రం సెయింట్ బెడేస్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు. ఇక లైయోలా కళాశాల నుంచి బీకామ్ కూడా పూర్తి చేశారు. ఇంకేముంది చదువు అయ్యాక స్టార్ కిడ్ కాబట్టి సినిమాల్లోకి అడుగు పెట్టాల్సిందే. కానీ సూర్యకు మాత్రం అస్సలు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదట. అందుకే ఆయన బయట ఎక్కడైనా పని చేయాలని డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే ఒక గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 6 నెలలు పని చేశారట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీ యజమానికి అసలు సూర్య ఎవరు అన్న విషయం తెలీదు. మొత్తానికి డిగ్రీ తర్వాత మొదటి ఉద్యోగంగా ఇలా గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో చేరాడు. అక్కడ చాలా బాగా పని చేస్తున్నాడని పేరు కూడా తెచ్చుకున్నాడట.
Read Also: భారీ మొత్తానికి ‘కంగువ‘ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న స్ట్రీమింగ్ దిగ్గజం, ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
అయితే ఆ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు తన మొదటి జీతం రూ. 750 అని గతంలో సూర్య స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ ఆ తర్వాత అక్కడి యాజమాని తను ఎవరో గుర్తుపట్టారని, పైగా వర్క్ కూడా బోరింగ్ గా అనిపించడం వల్ల జాబ్ మానేశానని చెప్పుకొచ్చారు. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కాగా సినిమాల్లోకి వచ్చాక సూర్య అని పెట్టుకున్నారు. 1997లో "నెరుక్కునెర్" అనే సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య 'నందా' అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక 'సింగం' సిరీస్ ఈ హీరోకు స్టార్ స్టేటస్ ని తెచ్చి పెట్టింది. అలాగే 'సూరారై పొట్రు' అనే మూవీతో 2022లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఇప్పుడేమో తాజాగా పాన్ ఇండియా మూవీ 'కంగువా'తో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?