నర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియో
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి
కర్ణాటకలోని బెలగావిలో నర్సుపై ఘటన
ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఘటన
కర్ణాటకలోని బెలగావిలో నర్సుపై ప్రేమికుడు దాడి చేసిన ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించినందుకు అతను కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ జాదవ్ అనే యువకుడు తన బ్యాగులో దాచుకున్న కొడవలితో నర్సుపై దాడి చేశాడు. ఈ ఘటన ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కొద్ది రోజుల క్రితం ప్రకాష్ కుటుంబసభ్యులతో కలిసి నర్సు ఇంటికి చేరుకుని పెళ్లి గురించి మాట్లాడాడు. కానీ, ఆమె కుటుంబం అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దాంతో ఆగ్రహానికి గురై తన బ్యాగులో ఉన్న కొడవలి తీసి ఆమెపై దాడి చేశాడు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు నర్సు అతనితో తీవ్రంగా పోరాడింది. ఇది చూసి ఆస్పత్రిలో ఉన్న రోగులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.