Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
New Audi Q7: ప్రముఖ కార్ల బ్రాండ్ ఆడి కొత్త కారును మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్. దీని ధర రూ.88.66 లక్షలుగా ఉంది. ఈ కారును కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.
Audi Q7 Facelift Launched: ఆడి కొత్త క్యూ7ని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. కారు లాంచ్ అవ్వడంతో పాటు దాని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ లగ్జరీ కారు ధర రూ.88.66 లక్షలుగా ఉంది. దీనికి పెద్ద ప్లస్ పాయింట్ ఇదే. ఎందుకంటే ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన అన్ని ప్రత్యర్థి కార్ల ధర రూ. కోటి కంటే ఎక్కువగానే ఉంది. ఈ కారును కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.
ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ స్టైలిష్ లుక్
కొత్త ఆడి క్యూ7లో ఓఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కారులో కొత్త గ్రిల్ అమర్చారు. దీంతో పాటు కారు డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి కొత్త టెయిల్ ల్యాంప్‌లను కూడా అందించారు. ఈ కారు ఐదు ఎక్స్‌టర్నర్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఆడి కారు లోపలి భాగం గురించి చెప్పాలంటే ఈ కారులో రెండు అప్హోల్స్టరీ ఆప్షన్లు అందించారు. అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అప్‌డేట్ చేశారు.
Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
కొత్త ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌లో అనేక కొత్త ఫీచర్లు అందించారు. ఈ కారులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, 19 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. దీంతో పాటు కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా అందించారు. ఈ కారు మరోసారి మూడు వరుసల సీటింగ్ మోడ్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని మూడో వరుసను ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు.
ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఇలా...
కొత్త ఆడిలో వీ6 టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 340 బీహెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ కారు 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.
ఆటోమేకర్లు గతంలో ఆడి క్యూ8ని భారతదేశంలో విడుదల చేశారు. ఇప్పుడు క్యూ7 అప్‌డేటెడ్ మోడల్ లాంచ్ అయింది. భారతదేశంలో ఇప్పటివరకు క్యూ7 మునుపటి మోడల్ 10 వేలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు దీని కొత్త మోడల్ మార్కెట్లో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?
Witness the launch of the new, progress-driven and future-forward Audi Q7.
— Audi India (@AudiIN) November 28, 2024
Reserve your test drive now: https://t.co/Gy1LYO6xqO#ThisIsAudi #AudiIndia #AudiQ7 pic.twitter.com/aNlboWeJgv
When small details make a strong impression. This is Audi.
— Audi India (@AudiIN) November 28, 2024
The new Audi Q7 designed to turn heads.
Reserve your test drive now: https://t.co/1vnGLOx94l#ThisIsAudi #AudiIndia #AudiQ7 pic.twitter.com/SljJGdjyAh