YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
YSRCP: జనవరి నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వారీగా జిల్లాల పర్యటన చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Jagan has decided district wise tour from January: పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానని జగన్ పార్టీ నేతలకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశం అయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల బాట పడతానని.. జనవరి నెలాఖరునుంచి మొదలుపెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. ప్రతి పార్లమెంటును ఒక యూనిట్‌గా తీసుకుని నేను అక్కడకి వచ్చి బస చేస్తాను. బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ మమేకం అవుతానన్నారు. సమయం పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాం. అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యే కార్యక్రమం చేస్తామని తెలిపారు. "కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం" అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Also Read: సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు
తాను జిల్లాల పర్యటనలకు వచ్చేలోగానే జిల్లా స్ధాయి, నియోజకవర్గస్దాయి నుంచి మండలస్ధాయి వరకు వివిధ విబాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పామన్నారు. తన కార్యక్రమం మొదలైన తర్వాత మండలస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీ వ్యవస్ధను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తామని.. ఆ తర్వాత బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతామన్నారు.
గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేయాలని జగన్ స్పష్టం చేశారు. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలన్నారు. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలని సలహా ఇచ్చారు. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలైన ప్రశ్నల వర్షం... ఏమైంది మా స్కూల్? ఏమైంది మా హాస్పిటల్? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే అన్నవరకు ప్రశ్నలు లేవాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

