Venkataram Reddy Arrested: సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు
Vijayawada News: సచివాలయం ఉద్యోగలకు మందుపార్టీ ఇచ్చిన వెంకటరామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా అర్థరాత్రి హంగామా చేశారని కేసు రిజిస్టర్ చేశారు.
Andhra Pradesh News: సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
సచివాలయం క్యాంటిన్ ఎన్నికల వేళ వెంకటరామిరెడ్డి చర్యలు వివాదానికి కారణమయ్యాయి. కొందరు సిబ్బందితో ఆయన మందుపార్టీ చేసుకున్నారు. కొంత మంది సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల విషయంపై చర్చించేందుకు ఇలా భేటీ అయినట్టు తెలుస్తోంది.
తాడేపల్లిలో విజయవాడ క్లబ్ దాటిన తర్వాత ఉన్న కొండపావులూరి గెస్ట్ హౌస్‌లో వెంకటరామిరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనుమతులు లేని విదేశీ మద్యంతో అందరికీ పార్టీ ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
వెంకటరామిరెడ్డి అనుమతి లేని విదేశఈ మద్యం ఉందని పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారికంగా ఎలాంటి అనుమతి లేకుండా అర్థరాత్రి వేళలో పార్టీ ఏర్పాటు చేయడం మరో తప్పు. పార్టీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వెంకటరామిరెడ్డి ఆహ్వానం మేరకే తాము వచ్చామని అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగులు తెలిపారు.
అక్కడి వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరామిరెడ్డిసహా పలువురిని నిందితులుగా చేర్చారు. దీనిపై వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము డిన్నర్ చేస్తుంటే పోలీసులు వచ్చి హంగామా చేశారని అన్నారు. పార్టీలో మద్యం లేదని చెప్పుకొచ్చారు. పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వేధింపులు ఎక్కువయ్యాయని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అక్కడ సచివాలయ ఉద్యోగులను పట్టుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. అర్థరాత్రి వరకు విచారించారు. అనంతరం వెంకటరామిరెడ్డితోపాటు మిగతా వారిపై కేసులు పెట్టి వదిలేశారు.