Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
Krithi Shetty Interview : మన కంట్రోల్ లేని విషయాలకు మనల్ని బాధ్యులను చేస్తే చాలా బాధ కలుగుతుందని హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌పై ఎమోషనల్ అయ్యారు.

Krithi Shetty Opens Up About Her Career Criticism : ఫస్ట్ మూవీ 'ఉప్పెన'తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరోయిన్ కృతిశెట్టి. ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. మరోవైపు తమిళంలోనూ ఆమె మూవీస్ చేస్తున్నారు. తాజాగా, కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా 'వా వాతియార్'లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు.
బేబమ్మ కన్నీళ్లు
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పారు. గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ప్రాంక్ చేయడంతో ఆమె ఏడ్చేశారు. కెరీర్‌లో చిన్న వయసులోనే తాను చాలా విషయాలు చూసేసినట్లు చెప్పారు బేబమ్మ. 'సోషల్ మీడియాలో ఓ దశలో నాపై చాలా విమర్శలు, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాల టైంలో మనపై రీజన్ లేకుండా ద్వేషం చూపిస్తే తట్టుకోలేం.
మన కంట్రోల్‌లో లేని విషయాలకు మనల్ని బాధ్యులను చేస్తే చాలా బాధేస్తుంది. అటు కెరీర్‌లో రిజెక్షన్స్ ఎదురైనా చాలా బాధ కలుగుతుంది. అలాంటి టైంలో నాకు మా అమ్మే అండగా ఉంది. ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. పలు సందర్భాల్లో నా కోసం అండగా నిలబడ్డారు. ఇలా ఏడుస్తున్నప్పుడు ఇంటర్వ్యూ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ నా స్ట్రగుల్ గురించి అందరికీ తెలియాలి. ఇండస్ట్రీకి రాక ముందు ఎవరు ఏమన్నా పట్టించుకునే దాన్ని కాదు. కానీ ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతున్నా. కెరీర్‌లో అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలు కూడా నన్ను ప్రభావితం చేశాయి. అన్నీ పర్సనల్‌గా తీసుకోవడంతో నాకు ఈ బాధ తప్పలేదు. నేను ఇంత సెన్సిటివ్‌గా ఎందుకు మారాను అనే దానికి నా దగ్గర సమాధానం లేదు.' అంటూ చెప్పారు.
#KrithiShetty broke out emotionally high for the critisism & hate towards herpic.twitter.com/jTkuDIR8Mo
— AmuthaBharathi (@CinemaWithAB) December 7, 2025
Also Read : 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్... లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
ఆ రూంలో ఆత్మను చూశా
అలాగే, కొన్నాళ్ల క్రితం ఓ హోటల్‌లో తనకు జరిగిన వింత అనుభవం గురించి చెప్పారు కృతి శెట్టి. తన తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మను చూశానని అన్నారు. 'వా వాతియార్ షూటింగ్ ముందు రోజు రాత్రి మాకు ఆత్మ కనిపించింది. మేము రూంలో లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది మాకు సాయం చేయడానికి వచ్చిందో నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు.
నాకు ఫస్ట్ నుంచి ఆత్మలపై నమ్మకం ఉంది. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతాను. ఈ ఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది.' అంటూ చెప్పారు.




















