iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Apple iPhone 17 Pro Max: యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లీకులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఏ19 ప్రో చిప్‌సెట్‌పై ఇది రన్ కానుంది.
iPhone 17 Leak Features: యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో లాంచ్ అయింది. కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం అంటే 2024లో యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ని విడుదల చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు ఐఫోన్‌లను విడుదల చేసింది. ఈ నాలుగు ఐఫోన్లు భారతదేశంలో కూడా లాంచ్ అయ్యాయి.
ఇప్పుడు యాపిల్ లవర్స్ ఐఫోన్ 17 గురించి వెయిట్ చేయడం మొదలు పెట్టారు. గత కొన్ని వారాల్లో ఐఫోన్ 17 ప్రో గురించి చాలా కొత్త సమాచారం లీక్ అయింది. ఈ కథనంలో ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) గురించి ఇప్పటివరకు లీక్ అయిన అన్ని వార్తల గురించి తెలుసుకుందాం.
1. కొత్త డిజైన్
ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్‌కి తిరిగి రావడాన్ని చూడవచ్చు. ఇది గతంలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలో టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించింది. గ్లాస్, అల్యూమినియం మిక్స్‌ను ఫోన్ వెనుక ప్యానెల్‌లో చూడవచ్చు. వార్తల్లో వినిపిస్తున్న దాని ప్రకారం కెమెరా బంప్ పెద్దదిగా ఉంటుంది. దీన్ని అల్యూమినియంతో తయారు చేయనున్నారు. ఇది మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా కనిపిస్తుంది.
2. ఏ19 ప్రో చిప్
ఐఫోన్ 17 ప్రో... యాపిల్‌కు సంబంధించిన కొత్త ఏ19 ప్రో చిప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది టీఎస్ఎమ్‌సీ 3ఎన్ఎం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్, కెపాసిటీని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు యాపిల్ రూపొందించిన వైఫై 7 చిప్‌ను కూడా చూడవచ్చు.
Also Read: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
3. మెరుగైన ర్యామ్, స్టోరేజ్
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ల్లో 12 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఐఫోన్ 16 ప్రోలో అందించిన 8 జీబీ ర్యామ్ కంటే ఎక్కువ. మల్టీ టాస్కింగ్, యాపిల్ ఏఐ ఆధారిత ఫీచర్‌లకు సపోర్ట్ చేయడానికి ఈ అప్‌గ్రేడ్ చేశారు.
4. కెమెరాలో కూడా ఇంప్రూవ్‌మెంట్
ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్ కనిపించవచ్చు. ముందు కెమెరాను 12 మెగాపిక్సెల్ నుంచి 24 మెగాపిక్సెల్‌కి పెంచవచ్చు. ప్రో మోడల్స్‌లోని టెలిఫోటో కెమెరాను 48 మెగాపిక్సెల్‌కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
5. కొత్త డైనమిక్ ఐలాండ్
ప్రో మాక్స్ మోడల్‌లో ఒక చిన్న డైనమిక్ ఐలాండ్ అందిస్తారని సమాచారం. ఇది స్క్రీన్ టు బాడీ రేషియోను మెరుగుపరుస్తుంది. ఫేస్ ఐడీ సిస్టమ్ మెటా లెన్స్‌ని ఉపయోగించడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుంది.
అయితే ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతానికి వార్తల్లోనే ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో సిరీస్ త్వరలో 2025లో మార్కెట్లో లాంచ్ కానుంది. ఫోన్లు లాంచ్ అయితేనే కానీ ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో చెప్పలేం.
Also Read: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?