అన్వేషించండి

iPhone 16 Plus: ఐఫోన్ 16పై ఏకంగా రూ. 21,000 డిస్కౌంట్, ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుందో తెలుసా..

iPhone 16 Plus Price | ఐఫోన్ 16 ప్లస్ కొనాలనుకునే వారికి ఆపిల్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఈ ఐఫోన్ విజయ్ సేల్స్‌లో ఏకంగా ₹21,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

మీరు ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే సాధారణంగా ధర చాలా ఎక్కువ అని వాయిదా వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలు చేసి వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం లభించింది. 2024లో లాంచ్ అయిన iPhone 16 Plus ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్‌తో మార్కెట్లోకి వచ్చింది. పెద్ద స్క్రీన్, పవర్‌ఫుల్ A18 చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్న ఈ ఐఫోన్‌ను ఇంత తక్కువ ధరకు కొనే అవకాశం ఇప్పట్లో మళ్లీ రాదు. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఇది రూ. 21,000 తగ్గింపుతో లిస్ట్ చేశారు. ఈ ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు ఏంటి, ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) స్పెసిఫికేషన్లు
 ఈ ఆపిల్ ఫోన్ iPhone 16 Plusలో 6.7 అంగుళాల బిగ్ Super Retina XDR OLED డిస్‌ప్లే వస్తుంది.  ఇందులో యాపిల్ కంపెనీ ఫాస్టెస్ట్ అయిన A18 చిప్‌సెట్ అందించారు. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, మల్టీటాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన ఈ ఐఫోన్‌కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ విషయంలో IP68 రేటింగ్ లభించింది. ఫొటో, వీడియోగ్రఫీ కోసం దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 12MP కెమెరా అమర్చారు. ఈ ఫోన్ బ్యాటరీ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని ఆపిల్ కంపెనీ పేర్కొంది.

విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపు
iPhone 16 Plus భారత మార్కెట్లో రూ. 89,900 ధరతో లాంచ్ చేశారు. కానీ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది రూ. 71,890 కి లిస్ట్ అయింది. రూ. 18,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ఉన్న ఈ ఫోన్‌ను, HDFC క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే మరో రూ. 3,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఐఫోన్‌ 16పై మొత్తం రూ. 21,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. 

Pixel 9a ధర భారీగా తగ్గింపు
గూగుల్ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Pixel 10a ప్రీ-ఆర్డర్‌లు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే, గూగుల్ ప్రస్తుత మోడల్ Pixel 9a విక్రయాలపై ఫోకస్ చేసి, ఫోన్ ధర భారీగా తగ్గించింది. భారత మార్కెట్లో Pixel 9a 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999, 256GB వెర్షన్ ధర రూ. 54,999 కి లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు వేరియంట్ల ధరలపై ఏకంగా రూ. 10,000 చొప్పున డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో గూగుల్ పీక్సెల్ 9ఏ 128 జీబీ వేరియంట్ రూ. 39,999కు, 256 జీబీ వేరియంట్ ను రూ. 44,999 కే కొనుగోలు చేయవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget