అన్వేషించండి
Rushikonda Palace Photos: రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
Inside Pics Of Rushikonda Palace: విశాఖ రుషికొండలో వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలు రహస్యాలు నేడు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు
1/12

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో రుషికొండ భవనాలను, స్థానిక నాయకులతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.
2/12

ఇప్పటివరకూ ఎవరూ చూడని రుషికొండ కట్టడాలను చూసి టీడీపీ నేతలు, ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
3/12

దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు.
4/12

రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
5/12

రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
6/12

వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ రుషికొండపై అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్ రహస్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
7/12

జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం, ఆయన ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
8/12

టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అనుమతులు లేవని కూల్చారని, ఇప్పుడు ఏ అనుమతులతో రుషికొండపై భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
9/12

రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలపై స్పందిస్తున్నారు. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదన్నారు.
10/12

వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందనేది వారి ఇష్టం అన్నారు. విశాఖకి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మించినట్లు వైసీపీ చెబుతోంది.
11/12

విశాఖకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదని రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మాణాలు చేపట్టిందని వైసీపీ చెబుతోంది.
12/12

గతంలో పర్యాటక భవనాలు అని చెప్పి, ఇప్పుడు అధికారిక భవనాలు చెప్పడంతోనే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఆలోచన ఏంటని తెలిసిపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు.
Published at : 16 Jun 2024 10:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion