అన్వేషించండి

TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?

AP MLC Elections | టీడీపీ ఎమ్మెల్సి అభ్యర్థుల పేర్లు వచ్చేసాయి. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను చంద్రబాబు ప్రకటించారు.

TDP MLC Candidates | సస్పెన్స్  వీడిపోయింది. దాదాపు నెల రోజులుగా టీడీపీ నుండి ఎవరు ఎమ్మెల్సీలు అవుతారంటూ జరుగుతున్న చర్చకు తెరపడింది . కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, భీటీ నాయుడు పేర్లను టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి అభ్యర్థులు గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మొత్తం ఐదు సీట్లు ఖాళీ అవగా మూడు టిడిపి, ఒకటి జనసేన, మరొకటి బిజెపి తీసుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే  కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. టిడిపి నుంచి చాలామంది ఆశావహులు పోటీపడినా చంద్రబాబు మాత్రం పై ముగ్గురికే ఎమ్మెల్సి లుగా స్థానం కల్పించారు.


కావలి గ్రీష్మ  (SC )

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  ప్రతిభా భారతి కుమార్తె గా 2017లో టిడిపిలో చేరిన కావలి గ్రీష్మ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా, రాజాం నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేశారు. 2022లో  ఒంగోలులో జరిగిన మహానాడు వేదికపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ టిడిపి క్యాడర్లో జోష్ నింపింది. అలాగే పార్టీ అధిష్టానం దృష్టిలో ఫైర్ బ్రాండ్ గా ఒక గుర్తింపుని తీసుకొచ్చింది. "మిస్టర్ సీయం " అంటూ జగన్ పై ఆమె విరుచుకుపడిన తీరు ఆమెను ఒక లీడర్ గా చాలామంది దృష్టిలో పడేలా పడేలా చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆమెకు కీలక పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి తోడు మహిళా, దళిత అనే అంశాలు కూడా  దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు  ఎమ్మెల్సీ స్థానాన్ని గ్రీష్మ కు కేటాయించారు.

బీటీ నాయుడు (బీసీ )
 బెందుల తిరుమల నాయుడు  అలియాస్ బీటీ నాయుడు  ఉమ్మడి కర్నూలు జిల్లాకు జుమల దిన్నె గ్రామానికి చెందిన  టిడిపి నాయకుడు. 1994లో టిడిపిలో చేరిన బీటీ నాయుడు  1996 నుండి  మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. కడప అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిగా పనిచేసిన నాయుడు 2009, 2014  ఎన్నికల్లో కర్నూలు నుండి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు. అయినా పార్టీ కి ఆయన చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు 2019లో  టిడిపి నుండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దాన్ని కంటిన్యూ చేస్తూ శాసనమండలికి ఎంపిక చేశారు.


 బీద రవిచంద్ర (బీసీ )
 ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇసుకపల్లె గ్రామానికి చెందిన బీద రవిచంద్ర యాదవ్ యాదవ్ కు బీసీ నాయకుడుగా మంచి గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రవి చంద్రకు ఉంది.2015లో తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి,నారాయణ లాంటివారు ఉన్నా  పార్టీ వ్యవహారాలు రవిచంద్రకే అప్పగించేవారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరాక  మాత్రం వారిరువురి మధ్య అంతగా పొసగడం లేదన్న వార్తలు ఉన్నాయి. అయితే అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరికీ  సన్నిహితుడు కావడం  1999 నుండి పార్టీని అంటి పెట్టుకుని ఉండడం బీద రవిచంద్ర కు కలిసి వచ్చింది. దానితో చంద్రబాబు పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా  బీద రవిచంద్ర ను ఎంపిక చేశారు. ఈసారి మూడు స్థానాలను వెనుకబడిన బలహీన వర్గాలకే కేటాయించాలని చంద్రబాబు భావించడంతో దళిత బిసి వర్గాల నుండి  అభ్యర్థులను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Cockroach Janata Party: విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget