అన్వేషించండి

Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్

Prabhas movie title Baka: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించునున్న సినిమా టైటిల్ 'బ్రహ్మ రాక్షస' కాదని, ఈ చిత్రానికి కొత్త టైటిల్ ఖరారు చేశారని సమాచారం.

Prabhas and Prashanth Varma movie latest news: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిల్ 'బ్రహ్మ రాక్షస' కాదని... కొత్త టైటిల్ ఖరారు చేస్తారని ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అది ఏమిటో తెలుసా? 

బ్రహ్మ రాక్షస కాదు... 'బక', టైటిల్ ఇదే ఇక!
Prabhas mythological movie titled Baka: మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుని ఆధారంగా ప్రభాస్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ రాసుకున్నారని, ఆ కథకు 'బక' అనే టైటిల్ అనుకుంటున్నారని  సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల కథనం. ఇందులో టైటిల్ రోల్ 'బక'గా ప్రభాస్ కనిపిస్తారని‌ టాక్.

హీరో మారడంతో టైటిల్ మారిందా? ట్విస్ట్!
'హనుమాన్'తో గత ఏడాది సంక్రాంతికి దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మరొక సినిమా పట్టాలు ఎక్కించలేదు. ప్రతి సంక్రాంతికి తన నుంచి ఒక సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది తన సంకల్పమని చెప్పిన దర్శకుడు ఏడాది అంతా వేచి చూడాల్సి వచ్చింది. 

హిందీ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా 'బ్రహ్మ రాక్షస' సినిమా ప్రారంభించారు ప్రశాంత్ వర్మ. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఒక్క రోజు ముందు ఆ ప్రాజెక్ట్ ఆగింది. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏమిటి? అనేది‌ డైలమాలో పడిందని అనుకుంటున్న తరుణంలో ప్రభాస్ హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది.

Also Read: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టిన రోజు... ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా

రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ చేయాలని అనుకున్న 'బ్రహ్మ రాక్షస' సినిమాను ప్రభాస్ హీరోగా చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలలో బలంగా వినపడింది. కథ కూడా అదే! కానీ, హీరో మారడంతో ఇప్పుడు టైటిల్ కూడా మారింది. 'బ్రహ్మ రాక్షసి' కాస్త 'బక' అయింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ నిర్మాణ వ్యయంతో ఖర్చుకు రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ప్రభాస్ సరసన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసే సినిమాలో హీరోయిన్ రోల్ బ్యూటిఫుల్ లేడీ భాగ్యశ్రీ బోర్సే సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు ఆవిడ కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన 'ఆంధ్ర కింగ్ తాలూకా', దుల్కర్ సల్మాన్ సరసన 'కాంత' సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఛాన్స్ ఆవిడ చెంతకు వచ్చింది.

Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur : ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget