అన్వేషించండి

Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !

Kerala: చేప కొరకడంతో ఇన్ ఫెక్షన్ వచ్చి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలో జరిగింది.

Kerala fish : కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. అందులో నిజం ఉందో లేదో కానీ ఇంట్లో కర్రీగా మారాల్సిన చేప మాత్రం చేతుల్ని కూడా తీసేయగలదు. కేరళకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి అనుభవం చూస్తే నిజమని అంగీకరిస్తారు.                   

కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన టి రాజేష్ అనే వ్యక్తి తన చేతులపై బొబ్బలు వచ్చాయని తగ్గడం లేదని ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసి వైద్యులు ఉన్న పళంగా బొబ్బలు వచ్చినంత వరకూ కత్తిరించకపోతే ఇన్ ఫెక్షన్ మెదడుకు వ్యాపిస్తుందని ప్రాణాలు పోతాయని తేల్చారు. చేయి పోతే పోయింది ప్రాణాలైనా ఉంటాయని రాజేశ్ చేయి తీయించుకున్నాడు.అయితే బొబ్బలు వస్తే చేయి తీసేయాల్సినంత సీరియస్ అవుతుందా అన్న ప్రశ్న రాజేష్ గురించి తెలిసిన వారికి వస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఆ బొబ్బలు వచ్చింది ఓ చేప కరవడం వల్ల.                          

రాజేష్ కు కొన్ని చేపల చెరువులు ఉన్నాయి. వాటిలో చాలా రకాల చేపలు పెంచుతాడు. ఓ చెరువులో కడు అనే రకం చేపలు పెంచుతూంటాడు. మంచి లాభాలిచ్చే చేపలు కావడంతో  వాటిని పెంచే చేరువును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతాడు. ఇటీవల చెరువును క్లీన్ చేయించాలని అందులో కొద్దిగి మిగిలి ఉన్న చేపల్ని బయటకు తీశాడు. అలా తీస్తున్న సమయంలో ఓ చేప కరిచింది. చేపలు కరవడం అరుదు. అయినా టైం బాగోక ఆ చేప కరిచింది. అయితే ఇదంతా మామూలే అనుకుని అప్పటికి చెరువు శుభ్రం చేయించుకుని ఇంటికెళ్లిపోయాడు.              

అయితే చేప కరిచిన చోట క్రమంగా గాయం పెరుగుతూ పోయింది . దీంతో రాజేష్ నిర్లక్ష్యం చేయడం ఎందుకని ఆస్పత్రికి వెళ్లాడు. మామూలు గాయమేనని వైద్యులు కూడా భావించి కొన్ని టాబ్లెట్లు.క్రీములు ఇచ్చి పంపించారు. వాటిని వాడితే తగ్గకపోకేగా కొత్తగా చేయి అంతా బొబ్బలు వస్తున్నాయి. దీంతో కంగారు పడిన రాజేష్.. పెద్ద ఆస్పత్రికి వెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకున్నవైద్యులు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియా సోకినట్లుగా గుర్తించారు. ఇది ఒక సారి అంటుకుంటే శరీరం మొత్తం వ్యాపిస్తుందని అలా జరగుకుండా ఉండాలంటే.. వ్యాపించినంత వరకూ తీసేయాల్సిందేనని వైద్యులు తేల్చారు. ఈ బ్యాక్టిరియా మెదడు వరకూ వ్యాపిస్తే ప్రాణాలు నిలబడవని అందుకే చేతిని తొలగించి ప్రాణాలు కాపాడామని వైద్యులు చెబుతున్నారు. కేరళలో ఇప్పటికి ఈ వ్యాధి ఇద్దరికే సోకింది. అందులో ఓ దురదృష్టవంతుడు రాజేష్. 

చేప కరిచినందుకు చేయి పోయినందుకు బాధపడాలో.. కనీసం ప్రాణం నిలబడినందుకు సంతోషించాలో అర్థం కాని పరిస్థితి రాజేష్‌ది.   

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget