![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Telangana News | ఏసీబీ అధికారులు ఇరిగేషన్ శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ నివాసం, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అక్కడ లభ్యమైన డాక్యుమెంట్స్ ప్రకారం అక్రమాస్తుల విలువ రూ.150 కోట్లు ఉంటుందన్నారు.
![ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు! ACB raids at Irrigation Department AEE found RS 150 crore properties ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/30/36addd194da04f95aea4db782237366b1732962436010233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ACB raids at Irrigation Department AEE | హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఉదయం 6గంటల నుంచి అధికారులు సోదాలు చేస్తున్నారు. నిఖేష్ ఇంటితో పాటు సన్నిహతుల నివాసాలలో 25, 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా ఏసీబీ గుర్తించిన ఆస్తుల విలువ రూ.150 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి హైదరాబాద్ లో, పలు ప్రాంతాల్లో మొత్తం 30 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ దాడుల్లో భారీగా వ్యవసాయ భూములు, బిల్డింగ్స్, ఫాం హూస్ తదితర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ వంద నుంచి రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)