TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
TGPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి స్థానంలో బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. దీనికి గవర్నర్ ఆమోదించారు.
Telangana State Public Service Commission News Chairman Venkatesam: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంటేశం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిసెంబర్ 3తో మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానం వెంకటేశం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ఆమోదించారు.
డిసెంబర్ 3తో ప్రస్తుత ఛైర్మన్ మహీందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిపోతోంది. అందుకే కొత్త ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 45 అప్లికేషన్లు వచ్చాయి. వారిలో బుర్రా వెంకటేష్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పేరును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. దానికి ఇవాళ ఆమోదం తెలిపింది.
బుర్రా వెంకటేశం జనగామ జిల్లాలో 1968 ఏప్రిల్ 10న జన్మించారు. గురుకులాల్లో చదివిన ఆయన సివిల్స్ క్రాక్ చేశారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వెంకటేశం... రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
Also Read: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్