అన్వేషించండి
In Pics: చంద్రబాబుకు పూలతో ఆహ్వానం, ఘనంగా అమరావతి రైతుల ఏర్పాట్లు - ఫోటోలు
Chandrababu Photos: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు జూన్ 13న సాయంత్రం పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
1/7

చంద్రబాబుకు అమరావతి ప్రాంతానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2/7

2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి.. ఏకంగా వేలాది ఎకరాల భూములను సేకరించారు. అప్పట్లో ఎన్ని సమస్యలు వచ్చినా దాదాపు 35 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించగలిగారు.
3/7

చంద్రబాబు తన పాలనలో అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినప్పటికీ, వాటిని తాత్కాలిక భవనాలుగా పిలవడంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించలేదు. పైగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతి ప్రాంత రైతులు కదం తొక్కాల్సి వచ్చింది.
4/7

అలా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు సుమారు నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
5/7

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అమరావతి రైతులో సంతోషంలో ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకొనే జూన్ 13న సాయంత్రం ఆయనకు పూలతో స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత వాసులు ఇలా భారీ ఎత్తున పూలను సిద్ధం చేశారు.
6/7

గత రెండు రోజులుగా చంద్రబాబుకు స్వాగతం పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
7/7

చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయానికి వచ్చే సమయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం కోసం ఆ ప్రాంత రైతులు ఇలా భారీ ఎత్తున పూలను సిద్ధం చేశారు.
Published at : 13 Jun 2024 03:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion