Koganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP Desam
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన, 2021లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు లో సూత్రధారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి. హత్య చేయించింది తలశిల రఘురామ్, వెలంపల్లి శ్రీనివాస్. ఆ కేసులో మేం నిర్దోషులం. కావాలనే మమ్మల్ని ఇరికించారు అని పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కోరాడ విజయ్‌కుమార్ ఆరోపించారు. విజయవాడ కృష్ణలంకలో ప్రెస్ మీట్ పెట్టిన కోగంటి సత్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారు. కోగంటి సత్యం చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఓ మాజీ మంత్రిపై ఆరోపణలు చేయటం చర్చకు దారి తీస్తోంది. పైగా తన దగ్గరున్న ఆధారాలంటూ ఆయన కొన్ని ఆధారాలను చూపించటంతో అసలు వాటిలో ఏముంది అన్న కోణంలో ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. కోగంటి సత్యం ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు కోరే అవకాశం ఉంది.





















