Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP Desam
అదేంటీ చక్రవర్తిగారూ...ఐసీసీ కివీస్ అంటే మనకున్న సంప్రదాయక భయాన్ని కంటిన్యూ చేయటం తెలియదా మీకు. అలా గిర గిరా తిప్పేసి కేన్ మామ మనసు బాధ పెట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పిందండీ..పాపం బ్లాక్ క్యాప్స్ కు దుబాయ్ గ్రౌండ్ లో ఊహించని పరాభవం ఎదురైంది. టీమిండియా చాలా కష్టపడి పెట్టిన 250 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయటానికి మన కంటే ఎక్కువ ఇబ్బందులు పడిపోయింది పాపం. పోరాట యోధుడు కేన్ మామ 81 రన్స్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మన స్పిన్ ఉచ్చుకు కివీ పక్షులు విలవిలలాడిపోయాయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతిని గిర గిరా తిప్పటంలో తను నిజంగానే చక్రవర్తి నని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. విల్ యంగ్ తో మొదలుపెట్టి..గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ అలా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుని...కేన్ మామకు సపోర్ట్ లేకుండా చేసేశాడు వరుణ్ చక్రవర్తి. కేన్ విలియమ్సన్ మినహాయించి మరే బ్యాటర్ కూడా 30 పరుగులు పైన కొట్టకపోవటంతో న్యూజిలాండ్ 205పరుగులకే ఆలౌట్ అయిపోయి భారత్ కు 44 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది. అక్సర్ పటేల్ కేన్ మామను అవుట్ చేస్తే...పాండ్యా ను రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. అద్భుతమైన ఎకానమీ తో బౌలింగ్ చేశారు వీళ్లిద్దరూ కుల్దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.కానీ టాప్ 3 రోహిత్, గిల్, కొహ్లీ ఫెయిల్ అయ్యారు.30 పరుగులకే మూడువికెట్లు కోల్పోయింది టీమిండియా. కానీ కొహ్లీని ఫెయిల్ అనలేం ఎందుకంటే పాయింట్ లో కొహ్లీ కొట్టిన అద్భుతమైన షాట్ ను గ్లెన్ ఫిలిప్ పట్టాడండీ ఓ క్యాచ్ ..మైండ్ బ్లోయింగ్ అసలు. ఎక్కడో కిలోమీటర్ దూరం ఉన్నట్లు వెళ్తున్న బాల్ ను అత్యద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఈరోజు మ్యాచ్ లో హైలెట్ విజువల్స్ ఫిలిప్స్ పట్టిన క్యాచే. శ్రేయస్ అయ్యర్, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్యా పోరాడారు. అయ్యర్ 79 పరుగులు చేసి అవుటైతే...అక్సర్ పటేల్ 42పరుగులు చేశాడు. చివర్లో పాండ్యా 45పరుగులు చేసి పోరాడటంతో టీమిండియా 250 పరుగుల టార్గెట్ ను పెట్టగలిగింది బోర్డుపై. టోటల్ ఈ విక్టరీతో గ్రూప్ A లో అగ్రస్థానం సాధించిన టీమిండియా గ్రూప్B లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో నాలుగో తారీఖు సెమీఫైనల్ 1 ను ఆడనుంది. భారత్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ ఐదో తారీఖున సౌతాఫ్రికా తో సెమీ ఫైనల్ 2 ఆడనుంది.



















