New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
Telangana News | లక్ష రేషన్ కార్డుల జారీ అన్నారు. ఎన్నికల కోడ్ రావడంలో ఎన్నికలు లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లలో కార్డులు జారీ చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు మాటలకే పరిమితమయ్యాయి.

TG New Ration Cards | హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో ఇంకా జాప్యం జరుగుతోంది. మార్చి ఒకటిన లక్ష కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అడ్డంకిగా మారింది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ (MLC Elections) కోడ్ లేని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించినా.. ఇంకా కొత్త రేషన్ కార్డులు ఆ జిల్లాల్లోనూ జారీ కాలేదు. దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైందని, అందుకే కొత్త కార్డుల జారీ చేయలేదని తెలుస్తోంది.
6.68 లక్షల కుటుంబాలు కులగణన సర్వేలో తమకు కొత్త రేషన్ కార్డులు (Ration Cards) కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తుల్లో 5.12 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హమైనవిగా పౌరసరఫరాల శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందని మంత్రులు చెప్పారు. దరఖాస్తు దారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మార్చికి ముందే జారీచేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 1న దాదాపు లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సైతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సైతం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా కొత్త రేషన్ కార్డులు జారీలో ముందడుగు పడలేదు.
జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీ షురూ
తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న కొత్త రేషన్ కార్డులతో పాటు నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. దశలవారీగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. చాలామంది తమకు రేషన్ కార్డు జారీ కాలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో గ్రామసభలు నిర్వహించి కొత్తగా దరఖాస్తులు తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ శాఖ గారు చూపించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. మార్చి ఒకటిన లక్ష రేషన్ కార్డులు అందిస్తామని చెప్పడం మాటలకే పరిమితం అయిందని విమర్శలు వస్తున్నాయి.
రేషన్ కార్డులు లేక పథకాలు వస్తలేవ్, ఆరోగ్యశ్రీ లేదు
రేషన్ కార్డులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీతో పాటు 200 వందల యూనిట్ల వరకు ఇంటికి ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందుకోలేకపోతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు, గత పదేళ్లలో పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో లేకపోవడంతో నిమ్స్ లాంటి హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. 6 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు లేకపోవడంతో పలు పథకాలకు దూరమవుతున్నాయి. ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అందులో జాబ్ ఏం జరిగే అవకాశం ఉందని సాధారణ పద్ధతిలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది ప్రకటనకే పరిమితమైందని తమకు కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
Also Read: Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

