KGF Chapter 3 : మన రాకీ భాయ్ కన్ను ఈ బంగారపు గనులపై పడితే..?
KGF Chapter 2 ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపుతోంది. KGF Gold Mines చుట్టూ తిరిగే ఈ కథాంశానికి మన ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. మరి ప్రపంచంలో కేజీఎఫ్ లాంటి గనులు ఉన్నాయా..?
ఇప్పుడంతా కేజీఎఫ్ ఫీవర్ నడుస్తుంది కదా మరి కేజీఎఫ్ గనుల్లానే ప్రపంచంలోనే చాలా బంగారపు గనులున్నాయి. ఒక్కసారి వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ 5 అతిపెద్ద బంగారపు గనులు ఏంటో ఎక్కడున్నాయో చూద్దాం.
1.మురుంటో, ఉజ్ బెకిస్థాన్
ప్రొడక్షన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్ ఉజ్ బెకిస్థాన్ లో మురుంటోవ్. ఒక్క ఏడాదిలో మురుంటోవ్ గనుల నుంచి ఇరవై లక్షల ఔన్సుల బంగారాన్ని వెలికి తీస్తారు. క్విజిల్ కం ఎడారిలో ఉంటాయి మురుంటోవ్ గనులు. ఇంకా ఈ గనుల్లో 150 మిలియన్ ఔన్సుల బంగారం ఉండి ఉంటుందని అంచనా.
2. కార్లిన్, యూఎస్ ఏ
యూఎస్ఏ నెవడా స్టేట్ లో ఉన్న కార్లిన్ ట్రెండ్ మైన్స్ కూడా బంగారానికి ప్రసిద్ధి. ఈ గనుల ప్రత్యేకత ఏంటంటే ఇవి దాదాపు 56 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ దొరికేది బంగారమే అని గుర్తించటానికి చాలా కెమికల్ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 1665కిలో ఔన్సుల బంగారాన్ని ఈ గనుల నుంచి వెలికి తీస్తారు.
3. ఒలింపియాడా, రష్యా
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బంగారపు గని గా రష్యాలోని ఒలింపియాడా గనులకు పేరుంది. రష్యా బిగ్గెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్ పొలియస్ అధీనంలో ఉంది ఈ గని. ఈ గనిలో ఇంకా ముఫ్పై మిలియన్ ఔన్సుల బంగారం ఉందని భావిస్తున్నారు. ఏడాదికి 1200కిలో ఔన్సుల బంగారాన్ని వెలికి తీస్తుంటారు.
4. పబ్లో వియేజో, డొమినికన్ రిపబ్లిక్
డొమినికన్ రిపబ్లిక్ లోని పబ్లో వియేజో డొమినికా కార్పొరేషన్ అధీనంలో ఉంటుంది ఈ గని అందుకే అదే పేరుతో పిలుస్తారు. ఏడాదికి దాదాపు 903 కిలో ఔన్సుల బంగారాన్ని వెలికి తీస్తారు ఈ గనుల నుంచి.
5. గ్రాస్ బర్గ్, ఇండోనేషియా
ఇండోనేషియాలోని పపువా రీజియన్ లో ఉంది గ్రాస్ బర్గ్ గనులు. గత ఇరవై ఏళ్లుగా ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిపోతోంది. 2001లో ఏడాదికి 3వేల కిలో ఔన్సుల బంగారం తీసేవాళ్లు ఇప్పుడు దాదాపు 848 కిలో ఔన్సుల బంగారాన్ని మాత్రమే వెలికి తీయగలగుతున్నారు.
మన కేజీఎఫ్ విషయానికి వస్తే వాస్తవానికి ఇది చాలా గని మాత్రమే. కానీ ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే దాదాపు 900 టన్నుల బంగారం కేజీఎఫ్ గనుల నుంచి వెలికి తీశారని అంటారు. బ్రిటీషర్లు కేజీఎఫ్ ను మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్లు. ఎందుకంటే చెన్నై కూడా కరెంట్ లేని సమయంలో అంటే 1903 లోనే ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ సిటీ కేజీఎఫ్.