అన్వేషించండి

Top 10 Headlines Today: వీఆర్‌ఏ వ్యవస్థ పూర్తిగా రద్దు- అమరావతిలో ఇళ్లకు శంకుస్థాపన- జ్ఞానవాపి మసీదులో సర్వే షురూ!

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

అమరావతిలో ఇళ్లకు శంకుస్థాపన 

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు. మే 26న పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వీఆర్ఏ వ్యవస్థ రద్దు

నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలంచెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. విద్యార్హత ఆధారంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)లను 4 శాఖల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, నీటిపారుదల, పురపాలక శాఖలలో సర్దుబాటు  చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (VRAs) క్రమబద్ధీకరణ, సర్దుబాటుపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వే 

వారణాసిలోని ప్రఖ్యాత జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయించాలన్న హిందూ సంఘాల తరపు న్యాయవాదుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై ఆంక్షలు

రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై ఆంక్షలు విధించారు. రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మీదకు లారీలు, బస్సులు నిషేధించారు. కేవలం టూ వీలర్లు, కార్లు మినహా భారీ వాహనాలు బ్రిడ్జి పైకి నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మూడోసారి గెలిచే ఛాన్సే లేదు

తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ లేదన్నారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తొలిసారి ఉద్యమ సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. మూడోసారి గెలిచే ఛాన్సే లేదని, దమ్ముంటే సిట్టింగులకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్ విసిరారు.  ఇన్నాళ్లు దొరగారు దర్జాగా గడీల్లో ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు అని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్‌ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు  ‘భారత చైతన్య యువజన పార్టీ’ (BCY) అని ప్రకటించారు. గుంటూరు శివారులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపించి, కొత్త పార్టీ పేరును విధివిధానాలను ఆయన ప్రకటించారు. ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అంత బలమైన వ్యక్తా అని ఏపీలో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎనిమిది వికెట్ల దూరంలో విజయం 

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు ఆసక్తిగా మారింది. టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు ఎనిమిది వికెట్లు తీయాలి. అదే విండీస్‌ విజయం సాధించాలంటే మాత్రం 289 పరుగులు చేయాలి. సో ఐదో రోజు ఆట మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

క్రిస్మస్ సీజన్ మీద కర్చీఫ్స్ 

ఇయర్ ఎండ్ రావడానికి ఇంకా ఐదు నెలల టైమ్ ఉంది... క్రిస్మస్ పార్టీలకు కూడా! కానీ, సినిమా రిలీజులకు కాదు! అవును... ఐదు నెలల ముందు క్రిస్మస్ సీజన్ మీద కర్చీఫ్స్ వేశారు నలుగురు టాలీవుడ్ హీరోలు. ఈ ఏడాది క్రిస్మస్ ప్రేక్షకులకు మన హీరోలు మాంచి విందు భోజనం అందించేలా ఉన్నారు. ఒక్కసారి క్రిస్మస్ 2023కి వస్తున్న సినిమాలు ఏవో చూడండి!పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సీపెట్‌ నోటిఫికేషన్

చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్‌), స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 03 వరకు అవకాశం ఉంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీటు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కలలపై పరిశోధన కోసం పుర్రెకు రంధ్రం

కలలు ఎందుకు వస్తాయి? అనే దాని గురించి ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో సైన్స్ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ... ఇప్పటికీ మనుషులు ఎందుకు? ఎలా కలలు కంటున్నారు అనే దాని గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. వాటిపైనే పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్త మిఖాయిల్ రాదుగా. ఇతను రష్యాకు చెందిన సైంటిస్ట్. ఎప్పుడూ పరిశోధనలోనే మునిగితేలుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తన పైన తానే ప్రయోగం చేసుకున్నాడు. దానికి తగిన మూల్యాన్ని చెల్లించాడు. ఇంట్లోనే తన పుర్రెకు తానే చిల్లు పెట్టుకొని... లోపల ఒక చిప్‌ను పంపించాలనుకున్నాడు. కానీ అది విఫలం చెంది ఆసుపత్రి పాలయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Laila Movie Review - లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
Crime News: వాలెంటైన్స్ డే రోజు దారుణం- యువతిపై యాసిడ్ పోసిన యువకుడు, నారా లోకేష్ సీరియస్
వాలెంటైన్స్ డే రోజు దారుణం- యువతిపై యాసిడ్ పోసిన యువకుడు, నారా లోకేష్ సీరియస్
Thandel Collections: వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Laila Movie Review - లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
Crime News: వాలెంటైన్స్ డే రోజు దారుణం- యువతిపై యాసిడ్ పోసిన యువకుడు, నారా లోకేష్ సీరియస్
వాలెంటైన్స్ డే రోజు దారుణం- యువతిపై యాసిడ్ పోసిన యువకుడు, నారా లోకేష్ సీరియస్
Thandel Collections: వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
Vallabhaneni Vamsi Facts: పరిటాల రైట్ హ్యాండ్, Jr ఎన్టీఆర్ ఫ్రెండ్.. టీడీపీ ఎమ్మెల్యే.. జగన్ కు ఫ్యాన్- ఎవరీ వల్లభనేని వంశీ
పరిటాల రైట్ హ్యాండ్, Jr ఎన్టీఆర్ ఫ్రెండ్.. టీడీపీ ఎమ్మెల్యే.. జగన్ కు ఫ్యాన్- ఎవరీ వల్లభనేని వంశీ
JioHotstar Subscription Plans: జియో హాట్‌స్టార్ సేవలు ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు చూశారా
జియో హాట్‌స్టార్ సేవలు ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు చూశారా
Shiv Sena Aditya Thackera :
చంద్రబాబూ.. మీ ప్రభుత్వం కూలిపోతుంది... హెచ్చరించిన ఆదిత్య ఠాక్రే
JioHotstar Content: జియో హాట్‌స్టార్‌లో యూజర్లు సినిమాలతో పాటు ఏ కంటెంట్ వీక్షించవచ్చో తెలుసా!
జియో హాట్‌స్టార్‌లో యూజర్లు సినిమాలతో పాటు ఏ కంటెంట్ వీక్షించవచ్చో తెలుసా!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.