By: ABP Desam | Updated at : 23 Jul 2023 06:39 PM (IST)
వైఎస్ షర్మిల, కేసీఆర్
YS Sharmila Challenges CM KCR: తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ లేదన్నారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తొలిసారి ఉద్యమ సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. మూడోసారి గెలిచే ఛాన్సే లేదని, దమ్ముంటే సిట్టింగులకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్ విసిరారు. ఇన్నాళ్లు దొరగారు దర్జాగా గడీల్లో ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు అని ఆరోపించారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. తన కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్ లో కూర్చుంటే ఎమ్మెల్యేలు కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని పదే పదే ప్రస్తావించారు. నేతల అవినీతిని ప్రశ్నించిన వారిని చితకబాదారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కేసీఆర్ కు అర్థమైందన్నారు షర్మిల. అందుకే సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే... సర్వేలు ఎందుకు చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జనం ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర ఉలిక్కిపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప ఎన్నికల్లో గట్టెక్కలేనని తెలుసుకున్నారు కేసీఆర్. మీది అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఉంటే.. ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. మీరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుద్ధపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయాలని వైఎస్సార్ టీపీ డిమాండ్ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
TSSPDCL Jobs: విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం
KNRUHS: బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>