JioHotstar Content: జియో హాట్‌స్టార్‌లో యూజర్లు సినిమాలతో పాటు ఏ కంటెంట్ వీక్షించవచ్చో తెలుసా!
JioHotstar App: రిలయన్స్ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసి జియో హాట్‌స్టార్ వచ్చేసింది. యూజర్లు ఏ కంటెంట్ చూసే వీలుంటుంది అని యూజర్లకు అనుమానాలు తలెత్తాయి.

Content To Watch on JioHotstar App: రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనమయ్యాయి. దాంతో దేశంలో అతిపెద్ద కంటెంట్ ప్లాట్‌ఫాంగా జియో హాట్‌స్టార్ నిలిచింది. ఈ విషయంపై చాలా రోజుల కిందటే చర్చలు పూర్తి కాగా, సంస్థలు దీనిపై కీలక ప్రకటన చేయడం తెలిసిందే. తాజాగా జియో హాట్‌స్టార్ సేవలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డిస్నీ + హాట్‌స్టార్) విలీన ప్రక్రియ పూర్తయింది. దాంతో జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ఒకే ప్లాట్‌ఫాం జియో హాట్‌స్టార్‌గా మారింది.
సాధారణ ధరల నుంచి బడ్జెట్ ధరల వరకు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇదివరకే యూజర్లుగా ఉన్నవారు తమకు ఏ కంటెంట్ అందుబాటులో ఉంటుంది, ఏం చూడవచ్చు అని అనుమానాలు ఉండటం సహజం. కంపెనీ ప్రకటన, జాతీయ మీడియా కథనాల ప్రకారం జియో హాట్‌స్టార్ కొత్త ప్లాట్‌ఫాంలో కింద తెలిపిన కంటెంట్ అందుబాటులో ఉండనుంది.
జియో హాట్‌స్టార్‌లో ఏమేం చూడవచ్చు ?
ఈ విలీనమైన కొత్త ప్లాట్‌ఫామ్‌లో జియో సినిమా కంటెంట్, డిస్నీతో పాటు, ఎన్‌బీసీ యూనివర్సల్ పికాక్ (NBCUniversal's Peacock), వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ హెచ్‌బీవో (Discovery HBO), Paramount నుంచి దేశీయ, అంతర్జాతీయ కంటెట్ అందుబాటులో ఉంటుంది.
క్రికెట్ ప్రేమికులకు పండగే..
గతంలోలాగ కొన్ని సిరీస్‌లు జియో సినిమాలో, కొన్ని సిరీస్‌లో హాట్ స్టార్‌లో చూడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి విలీనంలో మీరు ఐసీసీ ఈవెంట్లతో పాటు, IPL, WPL, ఇతర డొమెస్టిక్ టోర్నమెంట్ మ్చాచ్‌లు వీక్షించవచ్చు.
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లీగ్స్‌తో పాటు ప్రో కబడ్డీ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ఐఎస్ఎల్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ మ్యాచ్‌లు సైతం అందుబాటులో ఉంటాయి.
ఆల్ట్రా HD 4K స్ట్రీమింగ్ తో పాటు మల్టీ యాంగిల్ వ్యూయింగ్, ఏఐ పవర్డ్ ఇన్‌సైట్ (AI-powered insights)లు, రియల్ టైమ్ స్టాట్స్ ఓవర్‌లేస్ ఫీచర్లతో మీరు కంటెంట్ వీక్షించవచ్చు అని సంస్థ తెలిపింది.
JioHotstar కొత్త ప్లాట్‌ఫాంలో ఇప్పుడు రూ.149 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
జియో హాట్‌స్టార్ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) లలో Disney+Hotstar యాప్ కొత్త లోగోతో జియో హాట్‌స్టార్ పేరుతో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి JioHotstar యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సంస్థ సూచించింది. ఇదివరకే ఉన్న Disney+Hotstar లేక JioCinema సబ్‌స్క్రైబర్స్‌ను కొత్త ప్లాట్‌ఫామ్‌కు మైగ్రేట్ అవుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

