అన్వేషించండి
Advertisement
Morning Top News: అమరావతి డ్రోన్ సమ్మిట్ లక్ష్యం ఏంటి ? స్కిల్స్ యూనివర్సిటీకి మరో భారీ విరాళం వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Todays Top 10 News:
1. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 లక్ష్యం ఎంతంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024" nను గతంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా జరిగే సమ్మిట్‌పై శుక్రవారం ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి డ్రోన్ వాడకం, తయారీ కేంద్రంగా ఏపీని ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. మళ్లీ ఆ సీనియర్లకే జిల్లా బాధ్యతలు
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా- కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు - వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా- రామిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు - బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. మద్యం మాఫియా.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో చంద్రబాబు మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్, 999 లెజెండ్, 999 పవర్ స్టార్ బ్రాండ్లను తీసుకొచ్చారని తెలిపారు. కానీ తమ పాలనలో వాటిని తీసుకొచ్చినట్టు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. బాబు పాలనలో 43వేల బెల్ట్ షాపులు నడిచేవని జగన్ చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. ఇసుక రిచ్‌లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. ప్రస్తుతం ట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ట్రాక్టర్లలో తీసుకెళ్లిన ఇసుకను అవసరాలకు కాకుండా ఎక్కడికైనా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. నిరుద్యోగ యువతకు అదిరిపోయే న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. గుంటూరులోని డీఎస్ఏ స్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ర్యాలీ ఉంటుందని.. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ ప్రోత్సాహం అందించింది. గౌతమ్ అదానీ ఈరోజు(శుక్రవారం) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. “అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ శ్రీ గౌతమ్ అదాని మర్యాద పూర్వకంగా కలిశారు. అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.” అని సీఎం ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8 . గ్రూప్-1పై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సింగిల్ బెంచ్ సమర్థించింది. దీంతో గ్రూప్-1 నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. 8 మంది కోసం లక్షల మంది భవిష్యత్తును నాశనం చేయలేమని తేల్చి చెప్పింది. ఈ పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని వెల్లడించింది. కాబట్టి ఈ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పలేమని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9.మియాపూర్‌లో చిరుత సంచారం
మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారం గురించి స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆనవాళ్లు గుర్తిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. పాక్ ప్రధానితో జైశంకర్ భేటీ
పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాలు దాయాది దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచినట్టు కనిపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. అక్కడ రెండు దేశాల మధ్య స్నేహాలు మెరుగుపడే సంకేతాలు కనిపించాయి. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జైశంకర్‌కు షెహబాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement