అన్వేషించండి

Indian Army: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?

Agniveer Recruitment: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. నవంబర్ 10 నుంచి 15 వరకూ గుంటూరులో ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Agniveer Recruitment Rally In Guntur: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ (Agniveer Recruitment) ర్యాలీకి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. గుంటూరులోని (Guntur) డీఎస్ఏ (DSA) స్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ర్యాలీ ఉంటుందని.. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్‌లో భాగంగా.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ టెన్త్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ 8th ట్రేడ్స్ మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం www.joinindinaarmy.nic.inలో అప్ లోడ్ చేయబడిన అన్ని పత్రాలను తీసుకురావాలన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, పారదర్శకంగా ఉంటుందని.. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. ఉద్యోగ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉన్న వారినే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు తొలుత ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు ఉంటాయి. రోజుకు వెయ్యి మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది.

Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
Hyderabad News: మియాపూర్‌లో చిరుత సంచారం - స్థానికుల భయాందోళన
మియాపూర్‌లో చిరుత సంచారం - స్థానికుల భయాందోళన
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
Hyderabad News: మియాపూర్‌లో చిరుత సంచారం - స్థానికుల భయాందోళన
మియాపూర్‌లో చిరుత సంచారం - స్థానికుల భయాందోళన
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
IIT Roorkee: ఐఐటీ రూర్కీ మెస్‌లో ఆహారంపై ఎలుకలు - వీడియోలు షేర్ చేసిన విద్యార్థులు
ఐఐటీ రూర్కీ మెస్‌లో ఆహారంపై ఎలుకలు - వీడియోలు షేర్ చేసిన విద్యార్థులు
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Civil Servants Village : 5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు -  వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు - వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
Embed widget