Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP Desam
అంతా బాగానే ఉంటాం. ఉన్నపళంగా ఒక పెన్నో పెన్సిలో ఎత్తాలన్నా ఓపిక ఉండదు. ఏదో నీరసం వచ్చిందిలే కాసేపు పడుకుంటాం. లేవటానికి ఓపిక ఉండదు. ఇలా మనకే తెలియని ఏదో నీరసం మనల్ని పూర్తిగా ఆవహించేస్తుంది. గులియన్ బాలే సిండ్రోమ్. GBS వైరస్ ఇప్పుడు దేశం మొత్తం వణికిపోయేలా చేస్తున్న వైరస్. రోజులు గడిచే కొద్దీ శరీరంలో ఒక్కో అవయవం పని చేయటం మానేస్తాయి. వారం నుంచి 14రోజుల్లోపు మరణం కూడా సంభవించవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కంగారు పెడుతున్న గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ లక్షణాలు ఇవి. నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ మీదా, రోగ నిరోధకశక్తి మీద పనిచేసే ఈ వింత వైరస్ ఇటీవలి కాలంలో విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ని గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఓ మహిళ కన్ను మూయటంతో ఏపీలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం నమోదైంది. అసలేంటీ GBS సిండ్రోమ్..ఈ వీడియోలో చూద్దాం.




















