Morning Top News: బీసీ రక్షణ చట్టం కోసం టీడీపీ పక్కా ప్రణాళిక , హమాస్ అధినేత హత్య వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Todays Top 10 News:
1. మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ కొత్త గేమ్
మూసి ప్రక్షాళన తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీకి డ్రీమ్ ప్రొజెక్ట్. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మూసిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఒక్క ప్రెస్ మీట్ ద్వారా చెక్ పెట్టారు. అసలు ఈ విషయంలో రేవంత్ పొలిటికల్ గేమ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. వన్యప్రాణులను తరలిస్తోన్న ట్రక్కు బోల్తా
నిర్మల్ జిల్లాలోని మొండిగుట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వన్యప్రాణులను తరలిస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో 2 మొసళ్లు రోడ్డు పై పడ్డాయి. . బీహార్ రాజధాని పట్నాలోని సంజయ్ గాంధీ జాతీయ జూపార్కు నుంచి రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ జూపార్కుకు తరలిస్తున్నారు. వీటిలో మరియాల్ జాతి 8 మొసళ్లు, రెండు తెల్ల ఏనుగులు, రెండు తెల్లపులులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు వృద్ధుడిపై దాడి, మృతి
సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిధిలో దారుణం జరిగింది. బైక్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న ఓ యువకుడిని ఆపిన వృద్ధుడు అలా వెళ్ళటం సరి కాదంటూ వారించాడు. దీంతో ఆ డి యువకుడు ముసలి వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాడు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు గురువారం మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 23 సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. హైడ్రా ఆర్డినెన్సుకు చట్టబద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. బీసీ రక్షణ చట్టం కోసం పక్కా ప్రణాళికతో టీడీపీ
ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాలని నిర్ణయించుకుంది. కులపరంగా, వ్యక్తిగతంగా దూషించినప్పుడు చర్యలు తీసుకునేలా ఓ చట్టం రూపొందించనున్నారు. బీసీ చట్టం రూప కల్పనలో న్యాయ నిపుణులు, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. అంతా మీరే చేశారు- టీడీపీపై సజ్జల మండిపాటు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. అసలు దాడి జరిగిన రోజు టాను మంగళగిరిలోనే లేనన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికిత పోర్వాల్ -బ్యూటీ విత్ బ్రెయిన్స్
నికిత పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కి చెందింది నికిత సుమారు 60కి పైగా నాటకాలలో నటించి మెప్పించింది. అంతేకాదు 250 పేజీల 'కృష్ణ లీల' అనే నాటకాన్ని కూడా రాసింది.టీవీ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించింది. మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో అటువైపు అడుగులేసి, ఇప్పుడు మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం బెంబేలెత్తించింది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో గురువారం లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబయికి వెళుతున్న ఈ రైలు దిబలోంగ్ స్టేషన్ వద్ద ఇంజిన్‌తో పాటు మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హర్యానాలో జిర్కా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి రోహింగ్యాలు మద్దతు పలికిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం ఓటర్లు 80 శాతం ఉండే జిర్కా అసెంబ్లీ సెగ్మెంట్‌లో మమ్మూన్ ఖాన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈయనపై గతంలో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. UAPA కేసు కూడా ఉంది. ముస్లిం వర్గం సపోర్ట్ తో పాటూ అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు కూడా మద్దతుగా నిలిచారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10.హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ హత్య
హమాస్ ను అంతమొందించే వరకు విశ్రమించేది లేదని పదే పదే చెబుతూ వస్తున్న ఇజ్రాయెల్ తాజాగా హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వార్‌ను నేల కూల్చింది. ఈయనే 7 అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారిగా చెబుతారు. ఇంత బిగ్ హెడ్ ను లేపేసిన తరువాత కూడా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం "ఇంకా ముగియలేదు" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..