అన్వేషించండి

Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?

Telangana News: ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. హైడ్రా, రైతు భరోసా, రెవెన్యూ చట్టం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Telangana Cabinet Meeting: ఈ నెల 23 తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ కానుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. హైడ్రా (Hydra) ఆర్డినెన్సుకు చట్టబద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా శాఖల నుంచి వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రాపై జోరుగా చర్చ సాగుతోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. పేదలు ఇళ్లు కోల్పోతున్నారంటూ ప్రతిపక్ష నేతలు హైడ్రాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా, ప్రభుత్వం ఈ విషయంపై వెనక్కు తగ్గడం లేదు.

హైడ్రాకు మరిన్ని బాధ్యతలు

అటు, రాజకీయ ప్రకంపనల మధ్యే ప్రభుత్వం తాజాగా హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను కట్టబెట్టింది. ఈ ఆదేశాలతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు వంటి ఆస్తులను ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా రక్షించనుంది. 'జీహెచ్ఎంసీ చట్టం - 1955' కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Also Read: Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
YSRCP News: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
Haryana CM takes oath : హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం - హాజరైన ఎన్డీఏ నేతలు - చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్
హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం - హాజరైన ఎన్డీఏ నేతలు - చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్
Railway Reservations :  రైలు ప్రయాణికులకు భారీ షాక్ -  టిక్కెట్ రిజర్వేషన్ల గడువుపై  రైల్వే శాఖ సంచలన నిర్ణయం
రైలు ప్రయాణికులకు భారీ షాక్ - టిక్కెట్ రిజర్వేషన్ల గడువుపై రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Nikita Porwal: ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటం విజేత నికిత పోర్వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - ఆమె నటించిన సినిమా ఏంటో తెలుసా?
ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటం విజేత నికిత పోర్వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - ఆమె నటించిన సినిమా ఏంటో తెలుసా?
Embed widget