News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: తిరుమల భక్తులను టెన్షన్ పెడుతున్న చిరుత- దరఖాస్తులను ఓట్లుగా మలుచుకునే ప్లాన్‌లో కేసీఆర్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

చిరుత దాడి 

అలిపిరి నడక మార్గంలో విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నడకమార్గంలో భయం భయం 

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి కాలి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైపోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎమోషనల్ రాజకీయం

ప్రభుత్వం వద్ద మీ దరఖాస్తు ఉంది.  ఎప్పటికైనా పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉంది. ఆ దరఖాస్తు క్లియర్ అయితే లక్షల సాయం వస్తుంది. అంత కంటే ఇంకేం కావాలి ? ప్రభుత్వానికి మళ్లీ ఓటేయడానికి. ఇంత కంటే ఓటర్ ను ఎమోషనల్ చేసే ఆయుధం ఏమి ఉంటుంది ? వారి దగ్గర నుంచి తీసుకునే ఒక్క దరఖాస్తే ఓట్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అదే ఎమోషనల్ రాజకీయం చేస్తున్నారు. ఎంతగా అంటే..  కనీసం ముఫ్పై శాతం కుటుంబాల నుంచి  ప్రభుత్వ  పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే అందరికీ సాయం అందుతుందన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. ఆ సాయం ఆషామాషీగా వందల్లో..వేలల్లో కాదు.. లక్షల్లో ఉంటుందని ఆశ కల్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బీజేపీ ధర్నాల్లో జనసేన 

భారతీయ జనత పార్టీ  పంచాయతీ నిధులను దారి మళ్లించినందుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసింది. ఈ ధర్నాల్లో అనూహ్యంగా జనసేన పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల జనసేన నేతలు...  ఉత్సాహంగా  పాల్గొన్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల తరవాత రెండు పార్టీల మధ్య కనిపించిని గ్యాప్ వచ్చింది.  ఇప్పటి వరకూ ఎప్పుడూ...  బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జనసేన... జనసేన పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో బీజేపీ పాలు పంచుకోలేదు. పొత్తులో ఉన్నామంటారు కానీ కలసి పని చేయలేదు. కానీ ఇప్పుడు జనసేనాధినేత మనసులో మార్పు వచ్చింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ప్రత్యేక ఆహ్వానితులు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను భాగస్వాములను చేయాలని కేంద్రం భావించింది. అందుకే దేశవ్యాప్తంగా సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, చేనేత కార్మికులు, మత్స్యాకారులు, భవన నిర్మాన కార్మికులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కలవడం ఖాయమేనా!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలపడం ఖాయం అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చేసిన చర్చలు కూడా ఫలవంతంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయంపై వైఎస్ షర్మిల స్పందించిన తీరు అత్యంత సానుకూలంగా ఉంది. శుక్రవారం రాత్రి (ఆగస్టు 11) వైఎస్ షర్మిల ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె బయటకు రాగానే షర్మిల వెంట కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

డూ ఆర్‌ డై మ్యాచ్

భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగనుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌లో తమ తుదిజట్టులో టీమ్ ఇండియా మార్పులు చేయవచ్చు. భారత్ సిరీస్‌ను దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఫైనల్‌కు టీమిండియా

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 సెమీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు 5-0తో జపాన్‌ను ఓడించింది. ఇప్పుడు భారత్ ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత ద్వితీయార్థంలో కూడా రెండు గోల్స్‌ చేసింది. దీంతో మ్యాచ్‌ను 5-0 భారీ తేడాతో గెలుచుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఖజానా కళకళ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధుల రాక బాగా పెరిగింది. పన్నుల ద్వారా సెంట్రల్‌ గవర్నమెంట్‌ సంపాదించిన ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే, ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (direct tax collection) 15.7 శాతం పెరిగాయి. ఇది, ఈ నెల 10వ తేదీ వరకు ఉన్న లెక్క.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జస్ట్ మిస్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే దాదాపు రూ.90 కోట్లు పైగా6 కో కలెక్షన్లను ‘జైలర్’ సాధించింది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Published at : 12 Aug 2023 09:35 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే

బీజేపీ ఎంపీ మనేకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్

బీజేపీ ఎంపీ మనేకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్

London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్‌ బ్రిడ్జ్‌, దాంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్‌ బ్రిడ్జ్‌, దాంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్‌ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్

I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్‌ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?