IND Vs WI: భారత్, వెస్టిండీస్ నాలుగో టీ20కి అంతా రెడీ - టీమిండియాకు డూ ఆర్ డై!
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 శనివారం జరగనుంది.
India vs West Indies 4th T20I: భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగనుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌లో తమ తుదిజట్టులో టీమ్ ఇండియా మార్పులు చేయవచ్చు. భారత్ సిరీస్‌ను దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిందే.
గత మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు రాణించలేకపోయారు. కాబట్టి భారత జట్టు బెంచ్ స్ట్రెంత్‌ను ప్రయత్నించవచ్చు. ఉమ్రాన్ మలికా లేదా అవేశ్ ఖాన్‌ను హార్దిక్ పాండ్యా ప్రయత్నించే అవకాశం ఉంది. ఉమ్రాన్ లేదా అవేశ్‌కి అవకాశం లభిస్తే, ముఖేష్ కుమార్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు.
గత మూడు మ్యాచ్‌ల్లో భారత ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనను పరిశీలిస్తే.. అందులో విశేషమేమీ కనిపించలేదు. కెప్టెన్ హార్దిక్ మూడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీశాడు. కానీ 80 పరుగులు సమర్పించాడు. అర్ష్‌దీప్ సింగ్ 98 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ 78 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కూడా బాగా ఆందోళన కలిగించే అంశం. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతను కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టగలిగాడు. సంజూ శామ్సన్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. శామ్సన్ మూడు మ్యాచ్‌ల్లో 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌ల్లో 33 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌కి అవకాశం కల్పించారు. కానీ యశస్వి కూడా రాణించలేకపోయాడు.
భారత్ తుది జట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్/ఉమ్రాన్ మాలిక్
వెస్టిండీస్ తుది జట్టు (అంచనా)
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్/రోస్టన్ చేజ్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
Maturity with the bat ✨
— BCCI (@BCCI) August 9, 2023
Breathtaking shots 🔥
What's the wrist band story 🤔
Get to know it all in this special and hilarious chat from Guyana ft. @surya_14kumar & @TilakV9 😃👌 - By @ameyatilak
Full Interview 🎥🔽 #TeamIndia | #WIvIND https://t.co/7eeiwO8Qbf pic.twitter.com/TVVUvV3p7g
Also Read: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial