అన్వేషించండి

Direct Tax: ప్రత్యక్ష పన్నులతో కళకళలాడుతున్న ప్రభుత్వ ఖజానా, ఆగస్టు 10 వరకు ₹6.53 లక్షల కోట్లు

సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ. 6.53 లక్షల కోట్లు ఆర్జించింది.

Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధుల రాక బాగా పెరిగింది. పన్నుల ద్వారా సెంట్రల్‌ గవర్నమెంట్‌ సంపాదించిన ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే, ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (direct tax collection) 15.7 శాతం పెరిగాయి. ఇది, ఈ నెల 10వ తేదీ వరకు ఉన్న లెక్క. 

2023-24లో కేంద్ర ఖజానా అంచనాలు
డైరెక్ట్‌ టాక్స్‌ వసూళ్ల గురించి శుక్రవారం (11 ఆగస్టు 2023) అధికారిక గణాంకాలు విడుదలయ్యాయి. ఆ లెక్కల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆగస్టు 10 వరకు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ. 6.53 లక్షల కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల కంటే ఇది 15.7 శాతం ఎక్కువ. 

నికర (net) ప్రాతిపదికన, అంటే పన్ను చెల్లింపుదార్లకు జారీ చేసిన టాక్స్‌ రిఫండ్‌లను తీసివేస్తే, వచ్చిన మొత్తం డబ్బు రూ. 5.84 లక్షల కోట్లుగా ఉంది. నికర ప్రాతిపదికన కూడా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 17.33 శాతం వృద్ధి చెందాయి. ఈ సంఖ్య, మొత్తం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో (BE) 32.03 శాతానికి సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో 32 శాతానికి పైగా డబ్బు ఆగస్టు 10 నాటికే ఖజానాకు చేరింది.

గతంలో కంటే ఎక్కువ రిఫండ్‌లు జారీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదార్లకు ఎక్కువ టాక్స్‌ రిఫండ్స్‌ (Tax Refund) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 10 వరకు, టాక్స్‌ పేయర్లకు మొత్తం రూ. 0.69 లక్షల కోట్లను ప్రభుత్వం వెనక్కు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రిఫండ్‌ల కంటే ఇది 3.73 శాతం ఎక్కువ.

గత ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల
గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల మొత్తం వసూళ్లు 20 శాతానికి పైగా పెరిగి రూ. 19.68 లక్షల కోట్లకు చేరాయి. అవి స్థూల వసూళ్లు. వాటిలో... కార్పొరేట్ టాక్స్‌ ద్వారా రూ. 10.04 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా రూ. 9.60 లక్షల కోట్లు వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో గ్రాస్‌ కార్పొరేట్ టాక్స్‌ కలెక్షన్స్‌లో 16.91 శాతం, గ్రాస్‌ ఇండివిడ్యువల్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ వసూళ్లు 24.23 శాతం పెరిగాయి.

మరో ఆసక్తికర కథనం: కష్టకాలంలో నష్టాలను తగ్గించే మంత్రమిది - ఇన్వెస్టర్లు చాలా డబ్బు సంపాదించారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget