చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్
NTR Cine Vajrotsavam: సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి సినీ వజ్రోత్సవ వేడుకలను ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎన్టీఆర్ తో పని చేసిన సీనియర్ హీరోయిన్లు జయప్రద, నటి ప్రభ, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ తెలుగువారికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని ఆమె చెప్పారు. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని జయప్రద కొనియాడారు.





















