WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Simran Shaik: 2023లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ సూపర్ హిట్ అయింది. తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా, ఈ ఏడాది జరిగిన రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్ గా అవతరించింది.
WPL 2025Auction: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ కోస బెంగళూరులో ఆదివారం మినీ వేలం నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా భారత అన్ క్యాప్డ్ ప్లేయర్ సిమ్రాన్ షేక్ పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. వేలంలో వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జట్లు పోటీపడ్డాయి. వేలంలో ధరం పెంచుకుంటూ పోయి, రూ.1.90 కోట్లకు చివరికి గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే సిమ్రాన్ కోసం అన్ని జట్లు ఆసక్తి చూపడం విశేషం. దీంతో ఈ వేలంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ప్లేయర్ గా నిలిచింది. సిమ్రాన్ బేస్ ధర రూ.10 లక్షలు కాగా, తనను దక్కించుకునేందుకు ఆరంభం నుంచే ఢిల్లీ, గుజరాత్ పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ చెంతకు చేరింది ఈ తమిళ ప్లేయర్.
విండీస్ ప్లేయర్ కు రూ.1.70 లక్షలు..
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్ కు వేలంలో రూ.1.70 కోట్ల ధర పలికింది. ఈ ప్లేయర్ ను కూడా గుజరాతే సొంతం చేసుకోవడం విశేషం. ఆమె కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి రాగా, గుజరాత్, యూపీ వారియర్స్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు తగ్గేదేలే అనుకుంటూ డాటిన్ కూడా గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారత ప్లేయర్లు పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, సుష్మా వర్మా, శుభా సతీశ్ లతోపాటు ఇంటర్నేషనల్ స్టార్లు హీథర్ నైట్, లిజెల్ లీ, లారెన్ బెల్, సారా గ్లెన్, కిమ్ గార్త్ లపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చక పోవడంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.
అండర్ 19 ప్లేయర్ కి రూ.1.60 కోట్లు..
ఇక అండర్ 19 క్రికెట్లో సత్తా చాటిన 16 ఏళ్ల జి. కమిలినిపై కనక వర్షం కురిసింది. రూ.10 లక్షలతో వేలంలోకి వచ్చిన ఈ తమిళ వికెట్ కీపర్ ను దక్కించుకునేందుకు కొన్ని జట్టు ఆసక్తి చూపించాయి. చివరకు ముంబై ఇండియన్స్ జట్టు రూ.1.60 కోట్లు వెచ్చించి తనను దక్కించుకుంది. అండర్ 19 మహిళా టీ20 ట్రోఫీలో సత్తా చాటింది. ఎనిమిది మ్యాచ్ ల్లోనే ధనాధన్ ఆటతీరుతో 311 పరుగులు చేసింది. అలాగే కీపర్ అయినప్పటికీ, పార్ట్ టైమ్ బౌలింగ్ వేసే సత్తా కూడా ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ లోని ఐదు జట్లు ఈ వేలంలో కొంతమంది ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేశాయి. సిమాన్, డాటిన్, డేనియల్ గిబ్సన్ (రూ.30 లక్షలు), ప్రకాశిక నాయక్ (రూ.10 లక్షలు)లను గుజరాత్ దక్కించుకోగా, కమిలిని, నాడిన్ డి క్లర్క్ (రూ.30 లక్షలు), అక్షితా మహేశ్వరి (రూ.20 లక్షలు), సంస్కృతి గుప్తా (రూ.10 లక్షలు)లను ముందై కొనుగోలు చేసింది. యూపీ వారియర్స్ జట్టు.. అలానా కింగ్ (రూ.30 లక్షలు), అరుషి గోయెల్ (రూ.10 లక్షలు), క్రాంతి గౌడ్ (రూ.10 లక్షలు) లను దక్కించుకోగా, ఎన్ చరణి(రూ.55 లక్షలు), నందని కశ్యప్(రూ.10 లక్షలు), సారా బ్రైస్(రూ.10 లక్షలు), నికి ప్రసాద్ (రూ.10 లక్షలు)లను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ప్రేమ్ రావత్ (రూ.10 లక్షలు), రాఘవి బిస్త్(రూ.10 లక్షలు), జాగ్రవి పవార్ (రూ.10 లక్షలు)లను దక్కించుకుంది.
Also Read: Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్