AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh: తెలంగాణలో శ్రీపొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్శిటీ పేరు మారుస్తామని ప్రకటించిన వేళ ఏపీలో కొత్తగా ఆయన పేరుతో విశ్వవిద్యాలయం పెడుతున్న ప్రభుత్వం ప్రకటించింది.
Ap CM Chandra Babu Comments On Telugu University: అమరజీవి పొట్టి శ్రీరాముల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా డిసెంబర్ 15న శ్రీరాముల ఆత్మార్పణ దినంగా జరుపుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... త్వరలోనే పొట్టి శ్రీరాముల పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన త్యాగం మర్చిపోలేనిదన్నారు. అందుకే ఆయన ప్రాణ త్యాగం చేసిన రోజు డిసెంబర్ 15న ఆత్మార్పణ రోజుగా జరుపుతున్నామని తెలిపారు.
పొట్టి శ్రీరాముల స్ఫూర్తి రాబోయే తరాలకు తెలియాలనే పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చామన్నారు చంద్రబాబు. పవన్ ఇచ్చిన సూచనతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్‌లో ఆయన పేరుతో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 2014 తర్వాత ఆయన సొంతూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అయితే వాటిని తర్వాత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ అక్కడ అభివృద్ధి పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read: 'ఆడబిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలు' - ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క ఊరిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా అభివృద్ధిని వైసీపీ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టేయడమే కాకుండా ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా తిరోగమనం దిశలో తీసుకెళ్లిందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే మళ్లీ దారిలోకి తీసుకొస్తున్నామన్నారు. అమరావతి, పోలవరం పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటి అని అన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజంగా మార్చాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 తీసుకొచ్చామని గుర్తు చేశారు. దీనిపై అందరూ చర్చించాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో భవిష్యత్‌లో మరిన్ని పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్... మనుషులక మతి మరుపు సహజమన్నారు. ఇలాంటి వర్థంతులు, జయంతిలు వల్ల మహనీయుల గురించి తెలుసుకునే అవకాశం నేటి తరానికి తెలుస్తుందన్నారు. గట్టిగా మాట్లాడాలని అభిమానులు కేకలు వేస్తే... వర్థంతి రోజును అరిస్తే బాగుదోని వారించారు. సమాజం, రాష్ట్రం, దేశం కోసం బతికిన వ్యక్తి అయినందునే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రామ త్యాగం చేశారని అన్నారు. ఆయన ఓ కులానికో ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్న పవన్... దేశం గర్వించదగ్గ నాయకుడని అభివర్ణించారు. ఆత్మార్పణ రోజుగా జరపాలని చంద్రబాబు సంకల్పించడం గొప్ప విషయమన్నారు. సమయం లేనందు వల్ల సింపుల్‌గా చేశామని వచ్చే ఏడాది కచ్చితంగా గొప్పగా చేసుకుందామని పిలుపునిచ్చారు.
పొట్టి శ్రీరాముల పేరుతో హైదరాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం పేరును మారుస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. ఈ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టబోతున్నట్టు సమాచారం. 1985 డిసెంబరు 2న నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరు పెట్టారు.
Also Read: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం