వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే పెద్దపులి దాడి చేసిన ఘటన మర్చిపోకముందే తాజాగా చిరుతపులి ఓ మహిళపై దాడి జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన అర్క భీంబాయి ఉదయం బహిర్భూమికి వెళ్లిన టైంలో చిరుతపులి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో మహిళ కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఛాక చక్యంగా ఆమె తప్పించుకొంది. కంగారు పడుతూ వచ్చిన ఆమెను స్థానికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారు. దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఆటవిశాఖ అధికారులు ఆమెను పరామర్శించి తాత్కాలిక సహయంగా 5000 రూపాయలు అందించారు. ఈ విషయమై ఏబీపీ దేశం ఇచ్చోడ రేంజ్ అటవీ అధికారి పుండలిక్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. డెడ్రా ప్రాంతంలో చిరుత సంచారం వాస్తవమేనని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు.