Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు
Manchu Family Issue: సర్దుకుందనుకున్న మంచు మోహన్‌బాబు ఇంటి వివాదం మరోసారి రచ్చకెక్కింది. మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు మంచు మనోజ్. తన కుటుంబంపై హత్యా ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
Manchu Mohan Babu Family Issue: మంచు ఫ్యామిలీ పంచదార వివాదం రాజుకుంది. వారం రోజుల క్రితం మొదలైన ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో చల్లబడినట్టే కనిపించినా ఇదంతా కల్పన అని తేలింది. తన ఫ్యామిలీని వేధిస్తున్నారని మరోసారి పోలీసులను ఆశ్రయించారు మంచు మనోజ్. తన సోదరుడు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్‌తో కలిసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లి పుట్టిన రోజు ఉందని సోదరుడు విష్ణు, విజయ్, కిరణ్ జల్‌పల్లిలోని తన ఇంట్లోకి ప్రవేశించారని మనోజ్ చెప్పారు. ఆ టైంలో తాను సినిమా షూటింగ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. తన భార్య కుమారుడి స్కూల్ ఫంక్షన్‌కు వెళ్లినట్టు వెల్లడించారు. ఈ టైంలోనే కొందరు బౌన్సర్లతో ప్రవేశించి హంగామా సృష్టించారని అన్నారు. ఇంటి జనరేటర్‌లో పంచదార వేశారని అన్నారు. దీని కారణంగా రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు.
Also Read: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
విద్యుత్‌లో అంతరాయం చాలా ఆందోళన కలిగిచిందన్నారు మనోజ్. ఇంట్లో ఇద్దరు పిల్లలు అత్తమామ, అమ్మ ఉన్నారని అలాంటి టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జనరేటర్‌కు సమీపంలోనే గ్యాస్ కనెక్షన్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అక్కడకు సమీపంలోనే వాహనాలు కూడా పార్క్ చేసిన ఉంచామన్నారు.
ఈ బ్యాచ్ వెళ్లిపోతూ తన ఇంట్లో ఉన్న సిబ్బందిని కూడా బెదిరించారని వారంతా వెళ్లిపోయారని అన్నారు మనోజ్. తన కోచ్‌నూ కూడా పంపేశారని అన్నారు. కుటుంబంతో ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు మనోజ్. ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు.
అయితే చివరి నిమిషంలో తన ఆలోచన విరమించుకున్నారు. సోమవారం ఉదయం ఫిర్యాదు చేస్తానంటున్న మంచు మనోజ్ ప్రకటించారు. నిన్న జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో భార్య ఆరోగ్యం సరిగ్గా లేదని అన్నారు. దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తాను ఇప్పుడు బయటకు రాలేకపోతున్నట్టు సమాచారం అందించారు. జరిగిన ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యాదు చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
Also Read: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్