అన్వేషించండి

Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా

Allu Arjun latest news: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇదే కలవడం!

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం అంతటా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు సంచలనం సృష్టించింది.‌ ఒక రాత్రి జైలులో హీరోని ఉంచడం చర్చనీయాంశం అయింది. జైలు నుంచి వచ్చిన బన్నీని చూడడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అల్లు వారింటికి క్యూ కట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి మావయ్యను కలిసి వచ్చారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు...
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్!
అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే చిరంజీవి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వంభర' చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. బావకు ఓదార్పు ఇవ్వడంతో పాటు లాయర్ నిరంజన్ రెడ్డిని అల్లు అర్జున్ కేసు వాదించేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలగా నటించిన 'ఆచార్య' నిర్మాతలలో నిరంజన్ రెడ్డి ఒకరు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించింది ఆయనే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి ప్రముఖుల తాకిడి ఎక్కువ కావడంతో చిరంజీవిని కలవడం బన్నీకి కుదరలేదు. దాంతో ఈ రోజు కలిశారు. 

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. సతీసమేతంగా, కుటుంబంతో కలిసి వెళ్లారు. చిరు ఇంటికి బన్నీ స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్లడం గమనార్హం. చిరుతో బన్నీ స్నేహా రెడ్డి దిగిన ఫోటో అల్లు టీమ్ విడుదల చేసింది. మేనత్త సురేఖ, మావయ్య చిరును కలిసి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఏం మాట్లాడతారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. బన్నీని చూడడం కోసం శనివారం కూడా అల్లు వారింటికి సురేఖ వెళ్లారు. మేనల్లుడు అరెస్టు కావడంతో కంగారు పడినట్టు ఆవిడ తెలిపారు.

టాలీవుడ్ టాప్ హీరోలలో‌ ఒకరు అయినటువంటి వెంకటేష్ నుంచి మొదలు పెడితే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నాగచైతన్య అక్కినేని, విష్ణు మంచు, అడివి శేష్, సుధీర్ బాబు సహా అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, బోయపాటి శ్రీను, కొరటాల శివ, మారుతి తదితరులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. అయితే మెగా ఫ్యామిలీ ఎక్కడ అంటూ కొంత మంది ప్రశ్నలు వేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చినప్పటికీ... మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. వాటికి చెక్ పెడుతూ అల్లు అర్జున్ స్వయంగా మావయ్య దగ్గరకు వెళ్లారు.

Also Read: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో

ఇక కేసు పూర్వాపరాలు లోకి వెళితే... అభిమానులతో కలిసి 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ చూడడం కోసం‌ సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో వాళ్లను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అక్కడ ఒక మహిళ మృతి చెందడం తెలిసిన విషయాలే. ఆ కేసులో బన్నీని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం, బెయిల్ వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో ఒక రాత్రి జైలులో ఉండి తర్వాత తర్వాత బయటకు రావడం తెలిసిన ప్రజలు అందరికీ విషయాలే.

Also Readఅల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget